కర్నూలు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతుంటే మరోవైపు నేతలు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లలో కంప్లైన్ట్ చేసుకుంటున్నారు. కరోనా మహమ్మారి మ్యుటెంట్ ఎన్ 440 కె వేరియంట్ కర్నూలు జిల్లాలో ఉందని ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారని చెప్పి వైసీపీ నేతలు కర్నూలు జిల్లాలోని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీంతో ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. కాగా, ఇప్పుడు టీడీపీ నేతలు వైసీపీ నేతలపై కంప్లైంట్ చేశారు. ఎన్ 440 కె వేరియంట్ కర్నూలులో ఉన్నట్టు మంత్రి అప్పలరాజు పేర్కొన్నారని, టీడీపీ నేతలు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు.