ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ, మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. అయితే, ఆదివారం కావడంతో నాన్ వెజ్ మార్కెట్ల వద్ద రద్దీ అధికంగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటివి కనిపించడం లేదు. దీంతో ఆదివారం రోజున ఆంక్షలను కఠినంగా అమలు చేస్తే కొంతమేర ఫలితం కనిపిస్తుందని శ్రీకాకుళం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. శ్రీకాకుళంలో ఈరోజు సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. అత్యవసర సేవలు, నిత్యావసరాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఇచ్చాపురం నుంచిఎచ్చర్ల వరకు షాపులు మొత్తపడ్డాయి. దీంతో రోడ్లన్నీ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి.