తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కరోనా కేసులు తగ్గడంతో రెగ్యులర్ సేవలు ప్రారంభిస్తున్నాయి. కరోనా నెగిటివ్ వచ్చిన వారంతా త్వరగా కోలుకుంటుండటం, అత్యధికులకు ఐసీయూ బెడ్స్ అవసరం రాకపోవడంతో కరోనా అదుపులోకి వచ్చినట్లు కనిపిస్తోంది. ఇక కోవిడ్-19 ఆసుపత్రుల్లో చాలా పడకలు ఖాళీగానే ఉన్నాయి, ఆసుపత్రుల్లో రద్దీ కూడా ఎక్కువగా కనిపించడం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న…
జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అసలు, జూడాల సమ్మెకు కారణం ముఖ్యమంత్రియే నని.. కరోనభారిన పడే వైద్య సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఎక్కడ వైద్యం చేసుకుంటారు అంటే అక్కడ చేయించాలన్నారు.. జూడాలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు బండి సంజయ్.. జూనియర్ డాక్టర్ లు ఈ సమయం లో సమ్మె చేయడం సరికాదు.. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు……
మూడు రోజులు సూపర్ స్ప్రెడర్స్‌కు వ్యాక్సినేషన్ కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ నెల 28,29, 30 తేదీల్లో వారికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు .. ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రతి రోజు వైద్య శాఖ పై సమీక్ష నిర్వహిస్తున్నారన్న ఆయన.. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 3.8 శాతానికి తగ్గిందన్నారు.. ఆస్పత్రుల్లో కోవిడ్ అడ్మిషన్స్ కూడా తగ్గాయన్న ఆయర.. రికవరీ రేట్ 92.52 శాతానికి పెరిగిందని.. డెత్ రేట్ 0.52 శాతానికి పడిపోయిందన్నారు..…
గత బులెటిన్‌తో పోలిస్తే.. తెలంగాణ కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 3,762 కొత్త కేసులు నమోదు కాగా, మరో 20 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో.. 3,816 మంది కోలుకున్నారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,63,903కు చేరుకోగా.. రికవరీ కేసులు 5,22,082కు పెరిగాయి.. ఇక, ఇప్పటి వరకు 3,189 మంది మృతిచెందారు.. ప్రస్తుతం…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 18,285 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,27,390 కు చేరింది. ఇందులో 14,24,859 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,92,104 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 99…
శ్రీకాకుళం జిల్లాలో తాజాగా ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించాం అని శ్రీకాకుళం.జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. రిమ్స్ లో స్పెషల్ వార్డులో చికిత్స అందిస్తున్నాం. తీవ్రత ఎక్కువ ఉన్నవారికి మాత్రమే యాంపోటెరిసిన్ వాడుతున్నాం. బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ కు కావాల్సిన మెడిసిన్ అందుబాటులో ఉంది అన్నారు. అవసరం మేరకు ప్రభుత్వం నుంచి మందులు సప్లై ఉన్నాయి. ఆపరేషన్ అవసరమైతే చికిత్స చేయించేందుకు నిపుణులతో మాట్లాడుతున్నాం. అందుకు కావాల్సిన ఏర్పాట్లు రిమ్స్ , జెమ్స్ లో…
2020 డిసెంబర్ నుంచి ప్రపంచంలో కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. తొలిటీకాలను బ్రిటన్‌లో వేశారు. 60 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ అందించారు. తొలి టీకా వేయించుకున్న తొలి మహిళగా 91 ఏళ్ల మార్గరేట్ కీనన్ చరిత్ర సృష్టించగా, తొలి పురుషుడిగా 81ఏళ్ల విలియం షెక్స్ పియర్ చరిత్ర సృష్టించారు. అయితే, తొలి టీకా వేసుకున్న విలియం అనారోగ్యంతో మృతి చెందారు. టీకాకు విలియం మృతికి సంబందం లేదని, ఇతర అనారోగ్య సమస్యల వలన ఆయన…
టాటాస్టీల్ కంపెనీ మరోసారి ఉదారతను చాటుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కోవిడ్‌తో కన్నుమూసిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. ఉద్యోగకాలం ముగిసేవరకు మృతుల జీతాలను మృతిచెందినవారి కుటుంబాలకు అందిస్తామని టాటా స్టీల్ కంపెనీ స్ఫష్టంచేసింది. కేవలం జీతమే కాకుండా ఉద్యోగులకు లభించే అన్ని రకాల ప్రయోజనాలను కూడా వారి కుటుంబాలకు కూడా అందిస్తామని టాటా స్టీల్ కంపెనీ స్ఫష్టం చేసింది. ఉద్యోగుల పిల్లలు చదువుకు సంబంధించి విధ్యాభ్యాస ఖర్చులు కూడా తామే భరిస్తామని టాటా…
కరోనా మహమ్మారికి టీకాలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. మనదేశంలో జనవరి 16 వ తేదీ నుంచి టీకాలను అందుబాటులో ఉంచారు. మంగళవారానికి 130 రోజులు ఆయింది. 130 రోజుల వ్వవధిలో 20 కోట్లమందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఇప్పటి వరకు మొత్తం 20,04,94,991 మందికి వ్యాక్సిన్ అందించారు. 15,69,99,310 మందికి మొదటి డోసు వ్యాక్సిన్ అందించగా, 4,34,95,981 మందికి రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్‌ను అందించారు. దేశంలో జూన్ నెల నుంచి ఎక్కువ మొత్తంలో వ్యాక్సిన్‌లు…
కరోనా సమయంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు కేరళ వైద్యులు నదిని, అడవులను దాటుకోని వెళ్లారు. నలుగురు వైద్యబృందం ఈ సాహసం చేసింది. కేరళలోని డామిసిలియరీ కేర్ సెంటర్‌కు మురుగుల అనే మారుమూల ప్రాంతం నుంచి ఫోన్ వచ్చింది. 100 మంది నివశించే ఆ గ్రామంలో కొంత మంది కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారని ఫోన్ రావడంతో వెంటనే ముగ్గురు వైద్యులు కారులో బయలుదేరారు. కారు పుఝా…