జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో సీఎం కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అసలు, జూడాల సమ్మెకు కారణం ముఖ్యమంత్రియే నని.. కరోనభారిన పడే వైద్య సిబ్బంది వారి కుటుంబ సభ్యులు ఎక్కడ వైద్యం చేసుకుంటారు అంటే అక్కడ చేయించాలన్నారు.. జూడాలకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు బండి సంజయ్.. జూనియర్ డాక్టర్ లు ఈ సమయం లో సమ్మె చేయడం సరికాదు.. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు… కానీ, డాక్టర్ల డిమాండ్లను సీఎం వెంటనే పరిష్కరించాలన్నారు.. జూడాల ఆందోళనకు మా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్న ఆయన.. సీఎం ఆస్పత్రి పర్యటన సందర్భంగా ఏ సమస్యలు గుర్తించారో చెప్పలేదని విమర్శించారు.. జిల్లాలకు ఎన్ని నిధులు కేటాయించింది చెప్పలేదు.. రూ.2 వేల 500 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించిన బండి సంజయ్.. ఆసుపత్రిల్లో సీఎం వస్తున్నాడు అంటే సినిమా సెట్టింగ్ లెక్క ఏర్పాట్లు చేశారని.. సీఎం వెళ్లి నటిస్తున్నారంటూ ఆరోపించారు.. ఇక, కేసులు తగ్గాయని చూపించే ప్రయత్నం చేస్తున్నారు… తప్పుడు లెక్కలు చెపుతున్నారు అంటూ కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు బండి.