ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 84,224 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 16,167 మందికి పాజిటివ్‌గా తేలింది.. అయితే, మరోసారి మృతుల సంఖ్య వంద దాటింది.. తాజాగా 104 మంది కరోనాతో మృతిచెందారు.. చిత్తూరులో 14, పశ్చిమ గోదావరిలో 13, విశాఖలో 11, అనంతపూర్‌లో తొమ్మి ది, నెల్లూరులో తొమ్మి ది, గుంటూరు లో ఎనిమిది, విజయనగరం లో ఎనిమిది, ప్రకాశం లో ఏడుగురు, తూర్పు…
కరోనా వైరస్ ఎప్పుడు ఎవరికి సోకుతుందో తెలియదు.. అంతేకాదు.. దినసరి కూలి నుంచి చిన్న షాపులు, సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, ప్రభుత్వాలు, ప్రైవేట్ అనే తేడా లేకుండా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది.. గత ఏడాది ఫస్ట్ వేవ్ వణుకుపుట్టిస్తే.. ఈ ఏడాది సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది.. అయితే.. భారత ఆర్థిక వ్యవస్థపై కోవిడ్ ప్రభావం ఎలా ఉంది? అనే దానిపై వివరాలు వెల్లడించింది భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ).. కరోనా ఫస్ట్ వేవ్…
కరోనాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లపై తిరుగుతున్న ఆకతాయిల పనిపట్టారు మంచిర్యాల జిల్లాలోని జైపూర్ మండల ఏసిపి నరేందర్. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీసులు ఉదయం 10 గంటల తర్వాత రోడ్లపైకి రావద్దంటూ పలుమార్లు చెప్తున్నా వినట్లేదు. దీంతో ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్న వారి వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. అయినా చాలా మందిలో మార్పు రావడం లేదు. దీంతో కరోనా సోకుతుందని…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నివారణ కోసం గ్రూప్ అఫ్ మినిస్టర్స్ సమావేశం అయ్యారు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధ్యక్షతన జరిగిన జీఎంవో సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, కన్నబాబు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింఘాల్, డీజీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు.. కరోనా నియంత్రణ, బ్లాక్ ఫంగస్ నివారణకు తీసుకోవలసిన చర్యలు, వ్యాక్సిన్, ఆక్సిజన్ బెడ్స్, బ్లాక్…
కరోనా మహమ్మారికి ఎక్కడ ఎలాంటి మందు ఇస్తున్నారని తెలిసినా అక్కడికి పరిగెత్తుకు వెళ్తున్నారు ప్రజలు. ఆనందయ్య మందు కరోనాకు పనిచేస్తుందిని ప్రచారం జరగడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. వెలుగులోకి రానివి ఇంకా చాలానే ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, పులివెందులలో కరోనా నివారణకు ఆకు పసరు పేరుతో మందు పంపిణీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల ఆర్డీవో నాగన్న పసరు పంపిణీని అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా పసరును ప్రజలకు ఎలా సరఫరా చేస్తారని ఆగ్రహం…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్‌లో చైనాలో మొదటగా ఈ వైరస్‌ను గుర్తించారు. ఆ తరువాత ఈ వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించింది. అయితే, ఈ వైరస్ మూలాలను ఇప్పటి వరకు గుర్తించలేదు. కరోనా వైరస్ మూలాలపై తనకు మూడు నెలల్లో నివేదక అందజేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూఎస్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీని ఆదేశించారు. చైనాలో మొదట కనిపించిన ఈ వైరస్ జంతువుల నుంచి వచ్చిందా లేదంటే ప్రయోగశాలలో ప్రమాదం…
కరోనా మహమ్మారి వైరస్ వివిధ రకాల ఉత్పరివర్తనాలుగా మార్పులు చెందుతోంది. అందులో ఒకటి బి.1.617 వేరియంట్. ఇది ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందింది. ఇండియాతో పాటుగా ప్రపంచంలోని దాదాపుగా 60 దేశాల్లో ఈ వేరియంట్ విస్తరించింది. ఈ వేరియంట్ కారణంగా దేశంలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. మరణాల సంఖ్య పెరగడానికి కూడా ఇదోక కారణం అని చెప్పొచ్చు. ఈ వేరియంట్ కేసులు ఇప్పుడు ఆస్ట్రేలియాలో పెరుగుతున్నాయి. విక్టోరియా రాష్ట్రంలో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో…
ఒకవైపు కరోనా మహమ్మారి దేశాన్ని భయపెడుతుంటే, మరోవైపు బ్లాక్ ఫంగస్ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రోజురోజుకూ దేశంలో బ్లాక్‌ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఇక ఏపీలో బ్లాక్ ఫంగస్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. విజయవాడ నగరాన్ని బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. నగరంలో ఈ కేసులతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్నది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటికే 50కి పైగా ఈ కేసులు నమోదయ్యాయి. అటు ప్రైవేట్…
తెలంగాణలో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సడలింపులు ఉన్నాయి. 10 గంటల నుంచి తిరిగి తెల్లవారి 6 గంటల వరకు లాక్‌డౌన్ అమలులో ఉంటుంది. కేవలం నాలుగు గంటల పాటు మాత్రమే సడలింపులు ఉన్నాయి. అయితే, మే 30 వ తేదీతో లాక్‌డౌన్ సమయం ముగుస్తుంది. మే 30 తరువాత లాక్ డౌన్ కొనసాగిస్తారా లేదంటే ఎత్తివేస్తారా అనే విషయంపై ఈ నెల…