కరోనా సమయంలో ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్న గిరిజన ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు కేరళ వైద్యులు నదిని, అడవులను దాటుకోని వెళ్లారు. నలుగురు వైద్యబృందం ఈ సాహసం చేసింది. కేరళలోని డామిసిలియరీ కేర్ సెంటర్‌కు మురుగుల అనే మారుమూల ప్రాంతం నుంచి ఫోన్ వచ్చింది. 100 మంది నివశించే ఆ గ్రామంలో కొంత మంది కొన్ని రోజులుగా తీవ్రమైన జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారని ఫోన్ రావడంతో వెంటనే ముగ్గురు వైద్యులు కారులో బయలుదేరారు. కారు పుఝా నది ఒడ్డు వరకు మాత్రమే వెళ్లింది. అక్కడి నుండి ముగ్గురు వైద్యులు, కారు డ్రైవర్ సాహసయాత్ర మొదలుపెట్టారు. నలుగురు కలిసి మెల్లిగా నదిని దాటారు. ఆ తరువాత, అటాపడి అడవిలో 8 కిలోమీటర్లమేర కాలినడకన ప్రయాణం చేసి మురుగుల గ్రామం చేరుకున్నారు. అక్కడ 30 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో ఏడుగురికి పాజీటీవ్‌గా నిర్ధారణ జరిగింది. వీరిని వైద్యులు పుథూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యబృందం చేసిన సాహసయాత్రను కేరళ వైద్యశాఖ మెచ్చుకున్నది.