టాటాస్టీల్ కంపెనీ మరోసారి ఉదారతను చాటుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో కోవిడ్‌తో కన్నుమూసిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. ఉద్యోగకాలం ముగిసేవరకు మృతుల జీతాలను మృతిచెందినవారి కుటుంబాలకు అందిస్తామని టాటా స్టీల్ కంపెనీ స్ఫష్టంచేసింది. కేవలం జీతమే కాకుండా ఉద్యోగులకు లభించే అన్ని రకాల ప్రయోజనాలను కూడా వారి కుటుంబాలకు కూడా అందిస్తామని టాటా స్టీల్ కంపెనీ స్ఫష్టం చేసింది. ఉద్యోగుల పిల్లలు చదువుకు సంబంధించి విధ్యాభ్యాస ఖర్చులు కూడా తామే భరిస్తామని టాటా స్టీల్ స్పష్టం చేసింది. టాటా స్టీల్ తీసుకున్న నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించారు.