మూడు రోజులు సూపర్ స్ప్రెడర్స్‌కు వ్యాక్సినేషన్ కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.. ఈ నెల 28,29, 30 తేదీల్లో వారికి వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు .. ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రతి రోజు వైద్య శాఖ పై సమీక్ష నిర్వహిస్తున్నారన్న ఆయన.. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 3.8 శాతానికి తగ్గిందన్నారు.. ఆస్పత్రుల్లో కోవిడ్ అడ్మిషన్స్ కూడా తగ్గాయన్న ఆయర.. రికవరీ రేట్ 92.52 శాతానికి పెరిగిందని.. డెత్ రేట్ 0.52 శాతానికి పడిపోయిందన్నారు.. ప్రభుత్వ వాక్సిన్ సెంటర్లలో ప్రస్తుతం రెండో డోస్ మాత్రమే వేస్తున్నామన్న శ్రీనివాసరావు.. రాష్ట్రంలో 7.75 లక్షల మంది సూపర్ స్ప్రెడర్స్ ను గుర్తించామని.. వారికి 28 నుంచి వ్యాక్సిన్ ఇస్తామన్నారు.. ఇక, మీడియాను ఫ్రoట్ లైన్ వర్కర్లుగా గుర్తించామన్న ఆయన.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో మొదటి, రెండో డోసులు వేసుకోవచ్చు అని స్పష్టం చేశారు.