తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది.. ప్రతీరోజు లక్షకు పైగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నా.. పాజిటివ్ కేసులు మాత్రం రెండు వేల లోపే నమోదు అవుతున్నాయి.. తాజాగా ఆ కేసుల సంఖ్య 17 వందలకు చేరువైంది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,20,525 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1771 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో 13 మంది కోవిడ్ బారినపడి…
కరోనా ప్రస్తుతం మన దేశాన్ని అతలాకుతలం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మనుషులను కర్కసంగా మారుస్తుంది. కొన్ని గ్రామంలో కరోనా సోకినా వారిని మరి దారుణంగా చూస్తున్నారు. రాజమ్మ సిరిసిల్ల జిల్లా వీరపల్లిలో పాజిటివ్ వచ్చిందని ఓ బాలికను ఊరి బయట ఉండాలని ఆదేశించారు. పొల్లాలో చిన్న కవర్ తో గుడిసె వేసి అక్కడే ఉంచారు. దాంతో ఆ బాలిక వర్షానికి తడుస్తూ.. ఎండకు ఎండుతూ… రాత్రంతా భయంభయం గా గడిపింది. అయితే ఈ…
కంటికి కనిపించని కరోనా మహమ్మారితో ముందుంటి పోరాటం చేస్తున్నారు.. వైద్యులు, వైద్య సిబ్బంది.. ఇదే సమయంలో.. చాలా మంది కోవిడ్ బారినపడుతూనే ఉన్నారు.. ఇక, సెకండ్ వేవ్ వైద్య రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.. సెకండ్ వేవ్‌లో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి ఏకంగా 719 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు.. ఈ విషయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటించింది.. ఇక, మృతిచెందిన వైద్యుల సంఖ్య రాష్ట్రాలవారీగా చూస్తే.. అత్యధికంగా బీహార్‌లో 111 మంది వైద్యులు,…
కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. ఆర్థికంగా కొన్ని కుటుంబాలు చితికిపోతే.. భారీగా ప్రాణనష్టం కూడా జరిగింది.. తల్లిదండ్రులను, సంరక్షణలను కోల్పోయి వేలాది మంది చిన్నారులు అనాథలైన పరిస్థితి.. ఇక, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల హెచ్చరికలు ఇప్పుడు ప్రజల్లో వణుకుపుట్టిస్తున్నాయి.. మరోవైపు.. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో ఎదురైన అనుభవాలతో థర్డ్ వేవ్‌ను ఎదర్కొనేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం.. దీనికోసం లక్షమంది సుశిక్షితులైన ఆరోగ్య సిబ్బందిని (హెల్త్‌ఆర్మీని) సిద్ధం చేస్తోంది..…
తెలంగాణలో కరోనా పాజివిటీరేటు క్రమంగా తగ్గుతూ వస్తుంది.. ప్రతీరోజు లక్షకు పైగానే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నా.. పాజిటివ్ కేసులు మాత్రం రెండు వేల లోపే నమోదు అవుతున్నాయి.. తాజాగా ఆ కేసుల సంఖ్య 17 వందలకు చేరువైంది.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,24,066 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1707 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. మరో 16 మంది కోవిడ్ బారినపడి మృతిచెందగా..…
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 91,702 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,92,74,823 కి చేరింది. ఇందులో 2,77,90,073 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 11,21,671 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 3,403 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,63,079 కి చేరింది. ఇక ఇదిలా…
ప్రస్తుతం దేశంలో రెండోదశ కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. మూడో వేవ్ ప్రమాదం పొంచి ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ సంస్థ కొన్ని ఆసక్తి కరమైన విషయాలను తెలియజేసింది. కరోనా వైరస్‌లో అత్యంత వేగంగా వ్యాపించే వేరియంట్‌లు వస్తే అవి వ్యాక్సిన్ నుంచి తప్పించుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. కరోనా వైరస్‌ల వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. వైరస్ కట్టడికి సంబందించిన నిబంధనలను తూచా తప్పకుండా…