కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పట్టినా.. ఇంకా పూర్తిగా కంట్రోల్ లోకి వచ్చిన పరిస్థితి మాత్రం లేదు.. ఇదే సమయంలో కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు అందరినీ కలవరపెడుతున్నాయి.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలుచేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్.. కలెక్టర్లతో సమావేశమైన ఆయన.. వివిధ అంశాలపై దిశనిర్దేశం చేస్తూ.. కోవిడ్ థర్డ్ వేవ్‌పై కూడా స్పందించారు.. థర్డ్‌వేవ్ వస్తుందో, లేదో మనకు తెలియదు.. కానీ, మనం ప్రిపేర్‌గా ఉండడం అన్నది మన చేతుల్లోని అంశం..…
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ మంచి ఫలితాలనే ఇచ్చింది.. ఓ దశలో రికార్డు స్థాయిలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులు.. ఇప్పుడు క్రమంగా దిగివస్తున్నాయి.. అయినా.. కేసుల సంఖ్య ఇంకా భారీగానే ఉందని చెప్పాలి.. దీంతో.. మరోసారి కర్ఫ్యూను పొడగించే ఆలోచనలో ఉన్నారు సీఎం వైఎస్ జగన్.. కర్ప్యూ కొనసాగింపుపై ఆయన సంకేతాలిచ్చారు.. ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ప్రకారం ఈ నెల 20వ తేదీ వరకు ఏపీలో కర్ఫ్యూ అమల్లో…
కరోనా పరిస్థితులపై సీఎం జగన్ స్పందన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సిఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ నియంత్రణ విషయంలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పనిచేశారని..మే 5 నుంచి విధించిన కర్ఫ్యూ, అనుసరించిన వ్యూహం మంచి ఫలితాలను ఇచ్చిందన్నారు. కేసుల సంఖ్య తగ్గుతోంది, పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందని.. కోవిడ్ ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని.. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను కచ్చితంగా పాటించాలన్నారు. మాస్కులు, శానిటైజర్లు…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. పాజిటీవ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో సడలింపులు ఇస్తున్నారు. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 62,224 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు 2,96,33,105కి చేరింది. ఇందులో 2,83,88,100 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. 8,65,432 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2542 మంది మృతి చెందారు. ఇండియాలో…
అసోంలో ఆంక్షలను పోడిగించారు. పొడిగించిన ఆంక్షలు జూన్ 16 నుంచి 22 వరకు అమలులో ఉండబోతున్నాయి. పొడిగించిన ఆంక్షలు జూన్ 16 వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జూన్ 22 వ తేదీ ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటాయని ప్రకటించింది. రాష్ట్రంలో కోవిడ్ 19 పరిస్థితులను సమీక్షించామని, కరోనా బాధితుల సంఖ్య, వ్యాప్తిరేటు క్రమంగా తగ్గుతోందని, కానీ, తీవ్రత, పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగా ఉన్నాయని అసోం రాష్ట్ర విపత్తు నిర్వాహణ అధారిటీ…
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో మహమ్మారి నుంచి దేశం బయటపడుతున్నది. దీంతో ఒక్కొక్కటిగా తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు సడలింపులు ఇస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి మ్యూజియాలు తిరిగి తెరుచుకోబోతున్నాయి. అటు ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ కూడా ఈరోజు నుంచి తెరుచుకోబోతున్నది. సందర్శకులతో తిరిగి తాజ్‌మహల్ సందడిగా మారబోతున్నది. సందర్శకులకు అనుమతించినా తప్పనిసరిగా మ్యూజియంలలో కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు చెబుతున్నారు. నిబంధనలు పాటించకుంటే జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తున్నారు.
తెలంగాణలో క్రమంగా తగ్గుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసులు.. ఇవాళ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,043 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,556 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 14 మంది కరోనా బాధితులు మృతిచెందగా.. 24 గంటల్లో 2070 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,06,436కు పెరగగా.. రికవరీ కేసుల…
కరోనా మహమ్మారి ఎక్కడ ఎప్పుడు ఎలా సోకుతుందో తెలియని పరిస్థితి.. ముఖ్యంగా ఎక్కువమంది గుమ్మిగూడే ప్రాంతాల్లో వేగంగా విస్తరిస్తోంది ఈ వైరస్.. తాజాగా శ్రీకాకుళం నగరంలోని వైటీసీలో కోవిడ్ కలకలమే సృష్టించింది.. సూపర్-60 కోచింగ్ తీసుకుంటున్న 28 మంది విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. ఇటీవలే వారం రోజులు సెలవులపై ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తిరిగి కోచింగ్ సెంటర్ చేరుకున్నారు.. ఈనెల 2వ తేదీ నుంచి శిక్షణా తరగతులు తిరిగి ప్రారంభం అయ్యాయి.. ఇళ్ల నుంచి…
కరోనా సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పట్టడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు.. మరోవైపు.. కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికలు కలవరపెడుతున్నాయి.. ఈ తరుణంలో కోవిడ్ పరిస్థితి, థర్డ్ వేవ్ సన్నద్ధత పై గ్రూప్ అఫ్ మిమిస్టర్స్ సమావేశం జరిగింది.. మంత్రి ఆళ్లనాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సబ్ కమిటీ సభ్యులు, మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కన్నబాబు, అప్పలరాజు, ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు…
మన దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు భారీగా పెరిగిన కరోనా కేసులు ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు కూడా లక్ష లోపే కేసులు నమోదయ్యాయి. తాజాగా కేంద్రం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం దేశంలో కొత్తగా 60,471 కి చేరింది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,95,70,881 కి చేరింది. ఇందులో 2,82,80,472 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,13,378…