తెలంగాణలో క్రమంగా కోవిడ్ కేసులు తగ్గుతూ వస్తున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,30,430 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,798 మందికి పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ బారినపడి మరో 14 మంది మృతి చెందారు. ఇక, 24 గంటల్లో 2,524 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ప్రస్తుతం 23,561 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,98,611కు చేరింది, రికవరీ…
కరోనాకు చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇప్పటికే భారత్‌లో అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్ల ధరలను కేంద్రం ప్రకటించింది.. కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్-వి ధరలను ఖరారు చేసింది.. అయితే, ఇవి ప్రైవేట్ ఆస్పత్రుల్లో తీసుకునేవారికి మాత్రమే.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అయితే, అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.. ఇక, వ్యాక్సిన్ల కొరతను అధిగమించడానికి కొత్త వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది కేంద్రం… త్వరలో బయోలాజికల్-ఈ నుంచి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతోంది… ఇప్పటి…
కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తున్న భారత్‌ను ఆదుకోవడానికి అమెరికా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాకు 100 మిలియన్ డాలర్ల సహాయం ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కోవాక్స్ లో అమెరికా కుడా భాగస్వామిగా ఉన్నది. కొవాక్స్ కు అమెరికా 8 కోట్ల వ్యాక్సిన్ డోసులను అందివ్వబోతున్నది. ఇందులో నుంచి భారత్‌కు అందాల్సిన వ్యాక్సిన్ వాటాను అందిస్తామని అమెరికా ప్రకటించింది. భారత్ వాటా కింద 80 మిలియన్ వాక్సిన్ డోసులు అందనున్నాయి,…
కరోనాకు చెక్ పెట్టేందుకు పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. చాలా దేశాల్లో వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో వ్యాక్సిన్ వేయడం ఇప్పుడు కొన్ని దేశాలకు సవాల్‌గా మారింది. ముఖ్యంగా హాంకాంగ్‌లో ఈ సమస్య అధికంగా ఉన్నది. కావాల్సినన్ని వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడంలేదు. దీంతో అధికారులు, వ్యాపాదవేత్తలు, సామాజికవేత్తలు వ్యాక్సినేషన్ కోసం భారీ బహుమతులు ప్రకటిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకుంటే బంగారు కడ్డీలు ఇస్తామని, మిలియన్ డాలర్ల నగదును అందజేస్తామని ప్రకతిస్తున్నారు.…
ఏపీలో రేపట్నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చోటుచేసుకొనున్నాయి. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి వెసులుబాటు ఉండనుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కర్ఫ్యూ కటినంగా అమలు కానుంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సర్కార్. కర్ఫ్యూ వేళల్లో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఏపీలో జూన్…
కరోనా మహమ్మారి కేసులు తగ్గుముఖం పడుతున్న దాని ప్రభావం ఏ మాత్రం తగ్గడంలేదు. రోజువారి మరణాల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. నిన్న ఒక్కరోజే కరోనాతో 6,148 మంది మృతి చెందారు అంటే వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదో అర్ధం చేసుకోవచ్చు. అన్‌లాక్ ప్రక్రియ అమలు జరుగుతుండటంతో ప్రజలు బయటకు వస్తున్నారు. సొంత వాహనాల్లో ప్రయాణించేవారికంటే, సొంత వాహనాల్లో ప్రయాణం చేసేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఏ వాహనంలో ప్రయాణం చేస్తే ముప్పు ఎంత ఉంటుంది అనే…
దేశంలో కరోనా ఉదృతి క్రమంగా తగ్గుతున్న సంగతి తెలిసిందే. 4 లక్షల నుంచి లక్ష దిగువకు కేసులు నమోదవుతుండగా, మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. 4 వేల నుంచి రెండు వేలకు తగ్గిపోయింది. అయితే, నిన్నటి డేటా ప్రకారం ఇండియాలో 93,896 కేసులు నమోదవ్వగా, మరణాల సంఖ్యమాత్రం ఒక్కసారిగా భారీగా పెరిగింది. దేశంలో 24 గంటల్లో 6,138 మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇండియాలో మొత్తం 2,91,82,072 కేసులు నమోదవ్వగా, మొత్తం మరణాల సంఖ్య 3,59,695…
దేశంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టింది. కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కాగా థర్డ్ వేవ్ లో ఎక్కువ శాతం మంది చిన్నారులు వైరస్ బారిన పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల్లో వైరస్ లక్షణాలను ఎలా గుర్తించాలి, ఎలాంటి చికిత్స అందించాలన్న దానిపై కేంద్ర ఆరోగ్య శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. మరిముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను పిల్లలకు అసలు ఇవ్వకపోవటమే…
తెలంగాణలో క్రమంగా టెస్ట్‌ల సంఖ్య పెరుగుతూ ఉంటే.. రోజువారి పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,29,896 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 1,813 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. కోవిడ్ బారినపడి మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.. ఇదే సమయంలో 1801మంది కోవిడ్ నుంచి కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. ఇప్పటి వరకు…