లాక్‌డౌన్‌ను మరో పది రోజులు పొడిగిస్తూ.. మంగళవారం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. గతంలో విధించిన లాక్‌డౌన్ ఇవాళ కూడా అమల్లో ఉండనుంది.. కొత్త లాక్‌డౌన్ సడలింపులు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి.. కానీ, ఈ విషయంలో గందరగోళానికి గురైన ప్రజలు… ఇవాళ మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా భారీగా రోడ్లపైకి వస్తున్నారు.. గురువారం నుండి ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల వరకు.. ఇళ్లకు చేరుకోవడానికి అదనంగా మరో గంటతో సాయంత్రం 6 గంటల…
కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక సమర్పించారు డీహెచ్ శ్రీనివాస రావు. మే 29 నుంచి రోజుకు సరాసరి లక్ష పరీక్షలు జరుగుతున్నాయి అని తెలిపిన డీహెచ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 66,79,098 వ్యాక్సిన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో ఇన్ పేషంట్లు తగ్గుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 36.50 శాతం, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 16.35 శాతం పడకలు నిండాయి. మూడో దశ ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 10,366 ఆక్సిజన్ పడకలుగా మార్చాం.మిగతా 15వేల పడకలకు ఆక్సిజన్…
దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండటంతో చాలా రాష్ట్రాల్లో నిబంధనలను సడలిస్తున్నారు. అన్‌లాక్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. మరోవైపు వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రయను వేగ వంతం చేస్తున్నారు. అంతేకాదు, జూన్ 21 వ తేదీ నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన ఆందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం సిద్దమైంది. వ్యాక్సినేషన్‌తో పాటు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కనీసం రెండు నెలలపాటు నిబంధనలు పాటించాలని, అప్పుడే కరోనా వేవ్‌లు రాకుండా ఉంటాయని, కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం…
కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, తీవ్రత మాత్రం తగ్గడం లేదు. కరోనా బారిన పడిన వ్యక్తులు ఐసోలేషన్‌లో ఉండి నిబంధనలు పాటిస్తే తప్పనిసరిగా కరోనా బారి నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. సాధారణ వ్యక్తులు కరోనా బారిన పడితే, ఐసోలేషన్ కేంద్రాలకు వెళ్లి అక్కడే ఉండటం చేస్తారు. ఇక పల్లేల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పల్లెల్లో కరోనా బారిన పడిన వ్యక్తులు ఊరికి దూరంగా ఉంటున్నారు. కరోనా తగ్గేవరకు గ్రామంలోకి అడుగుపెట్టడంలేదు. అయితే, తెలంగాణలోని ఖమ్మంజిల్లా,…
నెల వ్యవధిలో కరోనా మహమ్మారితో తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటన శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తోండుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. సోదరి మృత్యువుతో హాస్పిటల్ లో పోరాడుతుంది. తోండుపల్లి గ్రామానికి చెందిన పెదిరిపాటి సుభాష్ గౌడ్ (50) చంద్రిక దంపతులకు ఏప్రిల్ 28న, 25వ వివాహ మహోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అయితే అప్పటికే సుభాష్ గౌడ్ తో పాటు అయన భార్య చంద్రిక, కుమారుడు, తల్లి సోదరికి కరోనా సోకింది. సాధారణ జ్వరం అనుకుని…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో నాలుగు లక్షలకు పైగా నమోదవ్వగా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య లక్షకు తగ్గిపోయింది. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 92,596 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,89,069కి చేరింది. ఇందులో 2,75,04,126 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 12,31,415 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో ఇండియాలో…
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.. దేశంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను సడలించి.. నైట్ కర్ఫ్యూ విధిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, మేఘాలయల్లో లాక్‌డౌన్ విధిస్తూనే…. భారీగా సడలింపులు ఇచ్చారు. తాజాగా బిహార్‌లో లాక్‌డౌన్ తొలిగించారు. అయితే అక్కడ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్ ఎత్తేసి.. పగటిపూట కర్ఫ్యూ కొనసాగించినప్పటికీ… తాజాగా ఆ కర్ఫ్యూను కూడా తొలిగించి నైట్ కర్ఫ్యూను…
తెలంగాణలో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి.. ఓవైపు టెస్టుల సంఖ్య పెంచినా.. పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం భారీగా తగ్గుతూ వస్తోంది… తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,33,134 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 1,897 మందికి పాజిటివ్ గా తేలింది.. మరో 15 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 2,982 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారని ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది..…