కరోనా మహమ్మారి కోసం విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసే ఆలోచన చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. మొదటల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే సడలింపులు ఇచ్చిన సర్కార్.. ఆ తర్వాత సడలింపుల సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచింది.. కేసులు తగ్గడంతో.. ఆ వెసులు బాటను 12 గంటల ఇచ్చింది. దీంతో.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు.. ఆపై లాక్‌డౌన్ అమలు…
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో నాలుగు లక్షలకు పైగా నమోదవ్వగా, ఇప్పుడు ఆ కేసుల సంఖ్య లక్షకు దిగువగా వస్తున్నాయి. తాజాగా కేంద్రం కరోనా బులిటెన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులిటెన్ ప్రకారం దేశంలో కొత్తగా 60,753 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,98,23,546కి చేరింది. ఇందులో 2,86,78,390 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,60,019 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇకపోతే, గడిచిన 24 గంటల్లో…
తమిళనాడు లో కరోనాతో మరో సింహం మృతి చెందింది. వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నెల మూడో తేదినా నీలా అనే తొమ్మిది సంవత్సరాల ఆడ సింహం మృతి చెందగా.. జూన్ 16 న పద్మనాధన్ అనే 12 ఏళ్ళ సింహం మృతి చెందింది. మొత్తం 11 సింహాలలో 9 సింహాలను కరోనా పాజిటివ్ సోకింది. వాటిలో నాలుగు సింహాలకు డెల్టా వేరియంట్ వైరస్ సోకినట్లు భూపాల్…
ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల మధ్య నిత్యం ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. అందులో సందేహం అవసరం లేదు. పాలస్తీనా దేశానికి చెందిన గాజా, వెస్ట్‌బ్యాంక్‌లు ఇజ్రాయిల్ ఆథీనంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, ఇప్పటికే ఇజ్రాయిల్‌లో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. కానీ, గాజా, వెస్ట్‌బ్యాంక్ లోని పాలస్తీనీయన్లకు ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందలేదు. దీంతో ఈ రెండు ప్రాంతాల్లోని పాలస్తీనియన్లకు వ్యాక్సిన్ అందించాలని నిర్ణయించింది ఇజ్రాయిల్. Read: మొత్తం అమ్మేసి, రాష్ట్రాన్ని…
ఆనందయ్య మందుతో ఎలాంటి ఇబ్బంది లేదు.. విశాఖ జిల్లాలోని అందరికీ క్రమంగా మందులు అందిస్తామని తెలిపారు ఎంపీ విజయసాయిరెడ్డి.. కోవిడ్ క్లిష్టసమయంలో ప్రాణాలకు తెగించి సేవలు అందించిన వారియర్స్ కు ఆనందయ్య మందు గిఫ్ట్ గా ఇచ్చిన ఎంపీ విజయసాయిరెడ్డి.. ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ఆనందయ్య మందు పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఫ్రంట్‌లైన్ వర్కర్స్ 22 వేలమంది ప్రాణాలు తెగించి విశాఖలో పని…
కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. యూరోప్, యూకే లాంటి దేశాలతో పోలిస్తే మన లాంటి దేశాలలో కోవిడ్ ని అడ్డుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి పని చేయాలి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆక్సిజన్ ప్లాంట్స్, వాక్సిన్ లు, మందులు అందుబాటులోకి తీసుకువచ్చింది సర్కారు. తెలంగాణకు 1400 వెంటిలేటర్ లు 46 ఆసుపత్రులకు ఇచ్చాము. గత 74 ఏళ్లుగా 18 వేల వెంటిలేటర్ వినియోగిస్తే గత రెండు ఏళ్లలో 50 వెలకు పైగా…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడి కోసం కర్ఫ్యూ అమలు చేస్తోంది ప్రభుత్వం.. పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతుండడంతో.. సడలింపులు ఇస్తూ వస్తున్నారు.. ఇక, గతంలో ప్రకటించిన కర్ఫ్యూ తేదీ ముగుస్తున్న తరుణంలో.. కోవిడ్ ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలో కర్ఫ్యూ వేళలు సడలిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.. తాజా నిర్ణయం ప్రకారం.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపులు అమల్లో ఉండనున్నాయి.. ఈ నెల 20వ తేదీ…
కరోనా సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా అదుపులోకి రాకముందే.. మరోవైపు థర్డ్ వే భయాలు ప్రజలను వెంటాడుతున్నాయి.. అయితే, థర్డ్ వేవ్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. అనవసరంగా ప్రజలను భయపెట్టకూడదని సూచించారు.. ఇవాళ హైదరాబాద్‌లోని దుర్గా భాయ్ దేశముఖ్ ఆస్పత్రిని సందర్శించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి ప్రపంచాన్నిపట్టి పీడిస్తోందన్నారు.. యూరప్, యూకే లాంటి దేశాలతో పోలిస్తే మన లాంటి దేశాలలో కోవిడ్‌ని అడ్డుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు…
ఇండియాలో కరోనా కేసులతో పాటుగా మరణాలు తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో కొత్తగా 62,480 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,97,62,793 కి చేరింది. ఇందులో 2,85,80,647 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,98,656 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 1,587 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,83,490 కి చేరింది.…