అసోంలో ఆంక్షలను పోడిగించారు. పొడిగించిన ఆంక్షలు జూన్ 16 నుంచి 22 వరకు అమలులో ఉండబోతున్నాయి. పొడిగించిన ఆంక్షలు జూన్ 16 వ తేదీ ఉదయం 5 గంటల నుంచి జూన్ 22 వ తేదీ ఉదయం 5 గంటల వరకు అమలులో ఉంటాయని ప్రకటించింది. రాష్ట్రంలో కోవిడ్ 19 పరిస్థితులను సమీక్షించామని, కరోనా బాధితుల సంఖ్య, వ్యాప్తిరేటు క్రమంగా తగ్గుతోందని, కానీ, తీవ్రత, పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగా ఉన్నాయని అసోం రాష్ట్ర విపత్తు నిర్వాహణ అధారిటీ తెలియజేసింది. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విపత్తు నిర్వాహణ సంస్థ తెలిపింది.