కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా కిందికి దిగి వస్తుండడంతో… కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది… ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలు యథావిథిగా నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కర్ఫ్యూ సడలింపు వేళల్లో యథావిథిగా కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇచ్చింది.. అయితే, ఉభయ గోదావరి జిల్లాల్లో మహమ్మారి కేసులు ఇంకా భారీగానే వెలుగు చూస్తుండడంతో.. ఆ రెండు జిల్లాలో సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ఆంధ్రప్రదేశ్ సర్కార్.