ప్రస్తుతం దేశంలో సెకండ్ వేవ్ క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. దీంతో ఆసుపత్రులపై ఒత్తిడి తగ్గుతున్నది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే నిబంధనలు సడలించారు. అన్ని రంగాలకు అనుమతులు ఇచ్చారు. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే, కరోనా కేసులు తగ్గుతున్నా, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని, తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం తప్పనిసరి అని చెబుతున్నారు.
Read: హారర్ మూవీ ఫస్ట్ లుక్ తో హీట్ పెంచేస్తున్న జాక్వెలిన్
వివాహాలకు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చినా, కరోనా థర్డ్ వేవ్‌ను ప్రజలు దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు తీసుకోవాలని, మూడో వేవ్ నుంచి బయటపడాలి అంటే అది ప్రజల చేతుల్లోనే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా మూడో వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంటుందని జమ్మూకాశ్మీర్ డిపార్డ్‌మెంట్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ హెడ్ డాక్టర్ మహ్మద్ సలీంఖాన్ హెచ్చరించారు. మూడో వేవ్‌ను దృష్టిలో పెట్టుకొని మాస్క్ ధరించడం, గతంలో ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు పాటించడం తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.