ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో.. కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేస్తూ ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే… మారిన ఈ కర్ఫ్యూ టైమింగ్స్ ఇవాళ్టి నుంచి అమలు కానున్నాయి. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో రాత్రి 10 గంటల నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉండనుంది…
read also : కిషన్ రెడ్డికి బంపర్ ఆఫర్… మూడు శాఖలు కేటాయింపు
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలు యథావిథిగా నిర్వహించుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కర్ఫ్యూ సడలింపు వేళల్లో యథావిథిగా కార్యకలాపాల నిర్వహణకు అనుమతి ఇచ్చింది.. అయితే, ఉభయ గోదావరి జిల్లాల్లో మహమ్మారి కేసులు ఇంకా భారీగానే వెలుగు చూస్తుండడంతో.. ఆ రెండు జిల్లాలో సాయంత్రం ఆరు గంటల నుంచి మర్నాడు ఉదయం వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.