కరోనా వైరస్‌తో పాటు మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. నోరో పేరుతో పిలుస్తున్న ఈ వైరస్ ఐదు వారాలుగా బ్రిటన్‌లో అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. బ్రిటన్‌లో ఇప్పటి వరకూ ఈ వైరస్‌కు సంబంధించి 154 కేసులు గుర్తించారు. నోరో వైరస్ కేసులు పెరుగుతుండటంతో బ్రిటన్ ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నోరో వైరస్ బారినపడిన వారికి తల తిరగడం, వాంతులు రావడం లాంటి లక్షణాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి…
కోవిడ్ కట్టడిలో భాగంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పౌరులకు కొత్త ఆంక్షలు విధించింది. రెడ్ లిస్ట్ పేరుతో రూపొందించిన జాబితాలోని దేశాలకు వెళ్లిన వారికి భారీ జరిమానాలు సహా విదేశాలకు వెళ్లకుండా మూడేళ్లపాటు నిషేధం విధించనున్నట్టు ప్రకటించింది. నిషేధిత దేశాలకు వెళ్లడం.. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అక్కడి సర్కారు స్పష్టం చేసింది. అయితే, ఆ జాబితాలో భారత్ తో పాటు యూఏఈ, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్, ఇరాన్, టర్కీ, అర్మేనియా, ఇథియోపియా, సొమాలియా, కాంగో,…
తెలంగాణలో వాక్సినేషన్ మందకొడిగా సాగుతోంది. జూన్‌లో పెద్దెత్తున వాక్సినేషన్ జరిగినా, ఒక్కసారిగా ఢీలా పడింది. మొదటి డోస్ వేసుకున్నోళ్లకు రెండో డోస్ ఇప్పుడు దొరకడం లేదు. ఇక ఫస్ట్ డోస్ వేసుకుందామనుకున్నవారికి అదికూడా దక్కడం లేదు. ఏ సెంటర్లో ఏ వ్యాక్సిన్ వేస్తున్నారో జనం వెతుక్కోవాల్సి వస్తోంది. తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారందికీ వాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు హైరిస్క్‌లో ఉన్న వాళ్ళకు మాత్రమే వాక్సిన్ వేయగా అర్హులందరికీ టీకా ఇస్తున్నారు.. ప్రభుత్వ సెంటర్లతో పాటు…
భారత్‌లో కరోనా కేసులు ఇంకా భారీగానే నమోదు అవుతున్నాయి.. రెండురోజుల నుంచి మళ్లీ పెరుగుతూ వస్తున్నాయి.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 43,509 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా.. రికవరీ కేసుల సంఖ్య మాత్రం తగ్గిపోయింది… తాజా బులెటిన్ ప్రకారం 38,465 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి… ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,03,840గా ఉన్నాయి.. రికవరీ రేటు 97.38 శాతంగా ఉందని బులెటిన్ లో పేర్కొంది సర్కార్… ఒకేరోజు…
కరోనా మమహమ్మారి నియంత్రణకు జారీ చేసిన మార్గదర్శకాల అమలును మరోసారి పొడిగించింది… వచ్చే నెల 31 (ఆగస్టు)వ తేదీ వరకు పొడిగించింది కేంద్రం.. మరోవైపు ఇప్పటికీ కరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న జిల్లాల్లో కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. ఇక, కరోనా కేసులు తగ్గినప్పటికీ నిబంధనలు పాటించాలని పేర్కొంది.. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల, ఆర్ ఫ్యాక్టర్ ఒకటి కన్నా ఎక్కువగా ఉండటంపై ఆందోళన వ్యక్తం…
ఏపీలో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు 70,695 శాంపిల్స్‌ను పరీక్షించగా, 2010 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,57,047 కి చేరింది. Read Also : సాంగ్ : “రాజ రాజ చోర” నుంచి చోరుడు వచ్చేశాడు ! ఇందులో 19,22,736 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.…
దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తున్నాయి. రోజువారి పాజిటివ్ కేసులు 30 వేల నుంచి 40 వేల వరకూ నమోదవుతున్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో కరోనా కంట్రోల్లోకి వచ్చినా, కేరళ రాష్ట్రంలో మాత్రం అదుపులోకి రావడంలేదు. పరిస్థితులు మరింత దిగజారేలా కనిపిస్తున్నాయి. రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో పాజిటివిటీ శాతం 5 శాతం కంటే తక్కువుగా నమోదవుతుంటే, కేరళలో మాత్రం 10 నుంచి 15 శాతం వరకు నమోదవుతుండటం…
కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ యూఎస్ తో పాటు ఇతర దేశాల్లోనూ కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయి. కానీ ఇండియాలో మాత్రం అన్ని భాషల్లోనూ సినిమా రిలీజ్ కు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు 2021లో కొన్ని పెద్ద హాలీవుడ్ సినిమాల విడుదలలను పరిగణనలోకి తీసుకుని సినిమా హాళ్ళపై ఆంక్షలు ఎత్తివేయనున్నారు. ఆగస్టు 5న భారతదేశంలో “సూసైడ్ స్క్వాడ్” విడుదల కానుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో ఇండియాలో రిలీజ్ కావడానికి…
భారత్‌లో కరోనా మహమ్మారి కేసులు తగ్గినట్టే తగ్గి.. మళ్లీ పెరుగుతూ ఆందోళనకు గురిచేస్తున్నాయి.. గత బులెటిన్‌లో 30 వేలకు దిగువకు వెళ్లిపోయిన పాజిటివ్ కేసులు.. ఇవాళ ఏకంగా 43 వేలు దాటేశాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా 17,36,857 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 43,654 మందికి పాజిటివ్‌గా తేలింది.. మృతుల సంఖ్య కూడా పెరిగిపోయింది.. ఒకేరోజు 640 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల…