మిడిల్ ఈస్ట్ దేశాల్లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న దేశాల్లో కూడా డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నది. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న 22 దేశాల్లో ఇప్పటికే 15 దేశాల్లో ఈ వేరియంట్ వ్యాపిస్తున్నది. ఈ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంతో ఈ పరిస్థితులు వచ్చాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలియజేసింది. మొరాకో నుంచి పాకిస్తాన్ వరకు గల మధ్యప్రాశ్చ్యదేశాల్లో ఈ కేసులు రికార్డ్ స్థాయిలో నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకోని వారిలో తీవ్రత…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ప్రస్తుతం వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారంగా కనిపిస్తున్నది. అయితే, వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ, వేగంగా వ్యాక్సిన్‌ను అమలు చేస్తున్నప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు కూడా కరోనా సోకుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో టీకాలను మిక్స్ చేస్తే ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది అనే విషయంపై టీకా కంపెనీలు, శాస్త్రవేత్తలు దృష్టిసారించాయి. ఇందులో భాగంగా ఆస్త్రాజెనకా టీకాతో రష్యా స్పుత్నిక్ వి లైట్ టీకాను కలిపి ఇస్తే ఎలా…
కరోనా పాజిటివ్ కేసులు ప్రపంచంలో తగ్గుతున్నా, వివిధ వేరియంట్‌లుగా రూపాంతరం చెందుతూ వైరస్ బలం పుంజుకొని తిరిగి ఎటాక్ చేస్తున్నది. వ్యాక్సిన్ తీసుకుంటున్నా కరోనా మహమ్మారి నుంచి కోలుకోలేకపోతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా ఎటాక్ అవుతుండటంతో సమస్యలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్‌లు ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇండియాలో సెకండ్ వేవ్‌కు ఈ డెల్టా వేరియంట్ కారణం అయింది. ఇప్పుడు దాదాపుగా 130 దేశాల్లో డెల్టా వేరియంట్‌లు ఇబ్బందులు పెడుతున్నాయి.…
ఆంధ్రప్రదేశ్‌లో నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసులు తగ్గుతున్నా తీవ్రత ఏమాత్రం తగ్గకపోవడంతో ముందుజాగ్రత్తలో భాగంగా నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఆగస్టు 14 వ తేదీ వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. కర్ఫ్యూ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఏపీలో రోజువారీ కేసులు 2 వేల వరకు నమోదవుతున్నాయి.…
2019 నవంబర్ నుంచి చైనాలో కరోనా కేసులు బయటపడటం మొదలుపెట్టాయి. డిసెంబర్ నుంచి కేసులు పెరగడం మొదలుపెట్టాయి. చైనా నుంచి కేసులు ఇతర దేశాలకు వ్యాపించడం మొదలయ్యాయి. ఆ తరువాత ప్రపంచంలోని అనేక దేశాల్లో లాక్ డౌన్ అమలు చేస్తూ వచ్చారు. గత రెండేళ్లుగా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా కరోనా ఏ మాత్రం తగ్గడంలేదు. వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ రూపాంతరాలు చెందుతూ బలం పెంచుకొని మరోమారు విజృంభిస్తున్నది. ప్రపంచంలోని దాదాపుగా 130 దేశాల్లో…
ఈనెల 23 నుంచి జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం అయ్యాయి. ప్రపంచంలోని దాదాపు 200 దేశాల నుంచి వేలాదిమంది క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొనేందుకు ట్యోక్యో చేరుకున్నారు. ప్రస్తుతం ఆరు రోజులుగా క్రీడలు జరుగుతున్నాయి. క్రీడలు ప్రారంభానికి ముందే ఆ దేశంలో కరోనా కేసులు తిరిగి పెరగడం ప్రారంభించాయి. ఇక రాజధాని టోక్యోలో కేసులు క్రమంగా పెరిగే అవకాశం ఉందని క్రీడలు ప్రారంభానికి ముందే నిపుణులు హెచ్చరించారు. కాగా, రోజు రోజుకు నగరంలో కేసులు…
భారత్‌లో ఈశాన్య రాష్ట్రాలతో పాటు కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉంది. మిగతా రాష్ట్రాల్లో రోజువారీగా వందల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే కేరళలో నిత్యం 10 వేలకు పైగానే కేసులు బయటపడుతున్నాయి. కేరళలో కొవిడ్ పరిస్థితులు చేజారిపోయినట్లు కనిపిస్తున్నాయని ఆరోగ్యరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. వైరస్ తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గింది. కేరళలో ఇంకా 10 శాతానికిపైగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశంలో నమోదవుతున్న రోజువారీ…