Venky Kudumula: డైరెక్టర్ ఇంట విషాదం.. దయచేసి ఆ పని చేయకండి అంటూ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venky Kudumula: టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ కుడుముల ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన కజిన్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కోవిడ్ తరువాత వచ్చే జ్వరాన్ని నార్మల్ గా తీసుకోవద్దని ఆయన వేడుకున్నాడు. అలా సాధారణ జ్వరమే అనుకోని నిర్లక్ష్యం చేయడం వలనే తన కజిన్ ను దూరం చేసుకున్నామని ఎమోషనల్ అయ్యాడు. ” నా కజిన్‌కి రెండు వారాలుగా జ్వరం వచ్చింది. కానీ అది కేవలం ఫీవర్‌గా భావించి సమయానికి డాక్టర్ వద్దకు వెళ్లలేదు. నిర్లక్ష్యం చేశాడు. కానీ.. ఆ జ్వరం GB సిండ్రోమ్ అని పిలువబడే అరుదైన వ్యాధిగా మారింది. మనిషిలోని రోగనిరోధకశక్తి అదుపు తప్పి నరాలపై దాడి చేయటం ఈ సిండ్రోమ్ పని. ఇక ఈ వ్యాధి తరువాత అతని ఆరోగ్యంలో చాలా మార్పులు వచ్చాయి. ఇది మొదట గుర్తించి సమయానికి చికిత్స చేస్తే నయమవుతుంది అని డాక్టర్స్ చెప్పారు. కానీ, వైద్యం నిర్లక్ష్యం చేయడం వలన అతని జీవితం కోల్పోయాడు. కుటుంబానికి తీరని విషాదాన్ని మిగిల్చాడు.
Sudigali Sudheer: బ్రేకప్ బాధలో సుధీర్.. ఏడిపించేశాడు
Also Read
కోవిడ్ తర్వాత, ఏ జ్వరం కేవలం జ్వరం కాదు.. మీ శరీరం సరైన స్థితిలో లేనప్పుడు, అది జ్వరం, అనారోగ్యం లేదా కొన్ని రకాల అసౌకర్యంతో మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి, వెంటనే ఆసుపత్రికి వెళ్లి చెకప్ చేయించండి. దయచేసి కాలానుగుణ ఆరోగ్య పరీక్షల కోసం సమయాన్ని వెచ్చించండి, ఏదైనా తప్పు ఉంటే వైద్యుడిని సంప్రదించండి. దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. ఆరోగ్యం వైపు ఒక చిన్న అడుగు జీవితాలను, కుటుంబాన్ని కోలుకోలేని నష్టం నుండి కాపాడుతుంది”అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ ట్వీట్ పై సెలబ్రిటీలు సైతం స్పందిస్తున్నారు. వెంకీ కుడుముల కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం నితిన్‌తో ఒక సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
#NotJustAFever 💔🙏🏻 pic.twitter.com/kuxuXr4V5L
— Venky Kudumula (@VenkyKudumula) November 7, 2023
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!