China : చైనాను చావు దెబ్బ కొట్టిన భారత్.. ఆ దేశ టీవీలు, స్మార్ట్‌ఫోన్లను మనోళ్లు కొంటలేరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China : ఒకప్పుడు చైనీస్ స్మార్ట్‌ఫోన్‌లు అందరినీ ఆకట్టుకునేవి. భారత్‌లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చైనా స్మార్ట్‌ఫోన్లు బడా కంపెనీలను కూడా భయపెట్టాయి. అనేక సంబర్భాల్లో చైనీస్ కంపెనీ Xiaomi కంటే ఆపిల్, శామ్సంగ్ కంపెనీలు వెనుకబడి పోయాయి. అయితే, చైనా ఉత్పత్తుల వృద్ధిని ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. అసలే ఇప్పుడు ఇండియన్ టెలివిజన్ రంగంతో డ్రాగన్‌కి పెద్ద దెబ్బ తగిలింది. భారతీయ టెలివిజన్ రంగంలో తొలిసారిగా చైనీస్ బ్రాండ్ టెలివిజన్ మార్కెట్ తగ్గింది. LG, Samsung వంటి పెద్ద బ్రాండ్లు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించాయి. దీని కారణంగా చైనీస్ టెలివిజన్ మార్కెట్ భారీ నష్టాన్ని చవిచూసింది. మరోవైపు, చైనా దాని ఉత్పత్తుల విశ్వసనీయత భారతదేశంలో కూడా తగ్గింది.
Read Also:iPhone 15 Sale in India: యాపిల్ ‘ఐఫోన్ 15’ సిరీస్ సేల్స్ మొదలు.. డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే!
Also Read
- Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
- 200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
- Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
చైనీస్ బ్రాండ్ మొబైల్ ఫోన్లు, టీవీల అమ్మకాలు భారతదేశంలో తగ్గుతున్నాయి. మార్కెట్ రీసెర్చ్ కౌంటర్ పాయింట్ టెక్నాలజీ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. చైనాకు చెందిన ప్రముఖ టెలివిజన్ బ్రాండ్‌లు OnePlus, Real Me త్వరలో భారతీయ మార్కెట్‌ను వదిలివేయవచ్చు లేదా వాటి మార్కెట్‌ను తగ్గించవచ్చు. ప్రస్తుతానికి వన్‌ప్లస్, రియల్ మీ ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడం లేదు. వాస్తవానికి ఏప్రిల్ నుండి జూన్ త్రైమాసికంలో చైనీస్ బ్రాండ్‌ల టీవీ షిప్‌మెంట్‌లు 33.6శాతం పడిపోయాయి. గతేడాది ఈ సంఖ్య 35.7 శాతంగా ఉంది. జూలై, ఆగస్టులలో కూడా చైనీస్ బ్రాండ్ల అమ్మకాలు 30 నుండి 33శాతం వరకు క్షీణించాయి. ప్రజలు ఇప్పుడు సామ్‌సంగ్, ఎల్‌జి, సోనీ కంపెనీలకు చెందిన మిడ్-సెగ్మెంట్, ప్రీమియం మోడళ్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాకుండా, Sansui , Acer వంటి బ్రాండ్‌లపై కస్టమర్ల ఆసక్తి కూడా పెరుగుతోంది.
Read Also:Rakul Preet Singh: కాటుక కాళ్ళతో మాయచేస్తున్న..రకుల్ ప్రీత్ సింగ్
Samsung, LG, Sony నుండి మిడ్-సెగ్మెంట్, ప్రీమియం మోడళ్లకు వినియోగదారుల ప్రాధాన్యత కారణంగా చైనీస్ బ్రాండ్‌ల షిప్‌మెంట్‌లు తగ్గుముఖం పట్టాయి. చైనీస్ బ్రాండ్లు నాలుగు త్రైమాసికానికి పైగా స్మార్ట్‌ఫోన్‌లలో మార్కెట్ వాటాను కోల్పోతున్నాయి. స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కూడా చైనా బ్రాండ్లు గత నాలుగు త్రైమాసికాలుగా మార్కెట్ వాటాను కోల్పోతున్నాయి. వారు ఎంట్రీ లెవల్ సెగ్మెంట్ నుండి బయటకు వస్తున్నారు. ఇటీవలి వరకు రూ. 7,000 నుండి రూ. 8,000 కంటే తక్కువ ఉన్న వర్గం చైనా కంపెనీల ఆధిపత్యంలో ఉంది. ఇప్పుడు వారు తమ మార్జిన్‌లను పెంచుకోవడానికి Samsung, Apple ఇతర కంపెనీలతో మిడ్ టు ప్రీమియం సెగ్మెంట్‌పై దృష్టి సారిస్తున్నారు.
తాజావార్తలు
-
Itlu Arjuna Teaser: మాటల్లేవ్… మాట్లాడుకోవడాలు లేవ్… డైలాగ్స్ లేకుండానే అనీష్ నటన అదుర్స్..
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!