హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్‌కు కితాబు ఇచ్చింది అమెరికా… కరోనాతో పాటు తాజాగా.. భారత్‌లో వెలుగుచూసిన ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. కోవాగ్జిన్‌పై టీకాలపై అధ్యయనం నిర్వహించిన అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్… ఎస్‌ఏఆర్‌ఎస్-సీవోవీ-2 ఆల్ఫా, డెల్టా వేరియంట్లను కోవాగ్జిన్ చాలా ప్రభావవంతంగా ఎదుర్కొంటుందని తేల్చింది.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరి నమూనాలను సేకరించి అధ్యయనం చేసిన ఎన్‌ఐహెచ్.. ఆల్ఫా…
కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు భారత్ బయోటెక్ ఫార్మాసంస్థ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్‌కు ఇప్పటికే భారత్‌లో అనుమతులు లభించాయి. వేగంగా వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, యూరోపియన్ దేశాలు కోవాగ్జిన్‌ను వ్యాక్సిన్‌గా గుర్తించకపోవడంతో అక్కడి దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేయలేకపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే, భారత్ వ్యాక్సిన్‌పై ఉన్న నమ్మకంతో బ్రెజిల్ కోవాగ్జిన్ ను కోనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. 20 కోట్ల…
కరోనా మహమ్మారిలో అనేక కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు ఇప్పటికే అనేక టీకాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త వ్యాక్సిన్ల కోసం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ వైరస్‌లో తరచుగా ఉత్పరివర్తనాలు జరగుతుండటంతో వ్యాక్సిన్లు వాటిపై ఎంత వరకు పనిచేస్తున్నాయి అనే దానిపై నిత్యం పరిశోధకులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. భారత్‌లో తయారైన కోవాగ్జిన్ వ్యాక్సిన్ పనితీరుపై అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై…
ప్రపంచాన్ని వణికిస్తోన్న మాయదారి కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలను వ్యాక్సిన్ల కొరత వెంటాడుతూనే ఉంది.. కానీ, త్వరలోనే వ్యాక్సిన్ల కొరత తీరపోనుంది.. ఎందుకంటే.. వచ్చే ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య ఐదు నెలల వ్యవధిలో మరో 135 కోట్ల టీకా డోసులు అందుబాటులోకి రానున్నాయి. వ్యాక్సినేషన్‌పై సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని పేర్కొంది. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య కొవిషీల్డ్ డోసులు…
దేశాన్ని డెల్టా వేరియంట్ మహమ్మారి ఎంతగా ఇబ్బందులకు గురిచేసిందో చెప్పాల్సిన అవసరం లేదు. డెల్టా వేరియంట్ కేసులు వ్యాప్తి చెందుతున్న సమయంలో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేశారు. దీంతో కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు డెల్టాప్లస్ కేసులు అక్కడకక్కడా నమోదవుతున్నాయి. డెల్టా ప్లస్ వేరియంట్‌లపై కూడా దేశీయ వ్యాక్సిన్లు కోవాగ్జిన్, కోవీషీల్డ్ పనిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. డెల్టా ప్లస్ వేరియంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, మెరుగైన ప్రజారోగ్యం ద్వారా ఈ వేరియంట్‌ను ఎదుర్కొనవచ్చని నిపుణులు చెబుతున్నారు.…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ వేయాల్సింది.. ఇప్పటి వరకు 18 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. 18 ఏళ్లు దిగువన ఉన్న చిన్నారులకు మాత్రం ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.. అయితే, ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ మాత్రం జరుగుతున్నాయి.. చిన్నారులకు వ్యాక్సిన్‌పై స్పందించిన ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా.. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి చిన్నారులకు కూడా కోవాగ్జిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు… రెండేళ్లు పైబడిన చిన్నారులకు ఆ వ్యాక్సిన్ వేసుకోవచ్చు అన్నారు.. ఇప్పటికే…
కరోనా కట్టడికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ప్రస్తుతం ఇతర దేశాల వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తుండగా.. ముందుగా.. భారత్‌లోనే రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చింది సర్కార్.. ఇప్పటికే కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు విస్తృతంగా వేస్తున్నారు.. ఇక, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలకు సంబంధించిన డేటాను సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్‌ఈసీ) ఆమోదించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకి కంపెనీ సమర్పించిన డేటా ప్రకారం మూడోదశలో కోవాగ్జిన్ 77.8 శాతం…
చిత్తూరు జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఈ జిల్లాలో కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ జిల్లా నుంచే మరణాలు కూడా అధికంగా సంభవించాయి. ఇక ఇదిలా ఉంటే, జిల్లాలోని గుడియానంపల్లిలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 31 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. Read: చిత్రసీమలో యోగసాధన! ఆ గ్రామంలో తొలిడోస్‌గా కోవీషీల్డ్ తీసుకున్న వారికి మెగా డ్రైవ్‌లో భాగంగా రెండో డోస్‌గా కోవాగ్జిన్ ఇచ్చారు. ఏఎన్ఎం తప్పిదం కారణంగా…
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకోచ్చిన సంగతి తెలిసిందే. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయడంతో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, బీహార్‌లోని ఓ మహిళకు అనుకోకుండా ఐదు నిమిషాల వ్యవధిలో కోవాగ్జిన్, కోవీషీల్డ్ వ్యాక్సిన్‌లను ఇచ్చారు. వెంటనే తప్పు తెలుసుకొని, మహిళను అబ్జర్వేషన్ సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. పాట్నాలోని పుపున్ బ్లాక్ టౌన్‌కు చెందిన సునీలా దేవి అనే మహిళ వ్యాక్సినేషన్…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఎప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, వ్యాక్సిన్ తీసుకుంటే.. ఏదో జరిగిపోతోందని.. చనిపోతున్నారని.. ఆస్పత్రి పాలవుతున్నారనే అనేక పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి.. మరోవైపు.. వ్యాక్సినేషన్ తయారీ విధానంపై కూడా ఆరోపణలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి.. తాజాగా, హైదరాబాద్ కేంద్రంగా వ్యాక్సిన్లు తయారు చేస్తున్న భారత్ బయోటెక్ పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి.. కోవాగ్జిన్ వ్యాక్సిన్ లో అప్పుడే పుట్టిన లేగదూడ పిల్లల ద్రవాలను వినియోగిస్తున్నట్లు సోషల్ మీడియా…