చిత్తూరు జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఈ జిల్లాలో కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ జిల్లా నుంచే మరణాలు కూడా అధికంగా సంభవించాయి. ఇక ఇదిలా ఉంటే, జిల్లాలోని గుడియానంపల్లిలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం కారణంగా 31 మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
Read: చిత్రసీమలో యోగసాధన!
ఆ గ్రామంలో తొలిడోస్‌గా కోవీషీల్డ్ తీసుకున్న వారికి మెగా డ్రైవ్‌లో భాగంగా రెండో డోస్‌గా కోవాగ్జిన్ ఇచ్చారు. ఏఎన్ఎం తప్పిదం కారణంగా 31 మందికి కోవీషీల్డ్ స్థానంలో కోవాగ్జిన్ ఇచ్చారు. దీంతో గ్రామంలోని ప్రజలు ఆంధోళన చేస్తున్నారు. 31 మంది ఆరోగ్యపరిస్థితి ఎలా ఉంటుందో అని భయపడుతున్నారు. గ్రామంవైపు వైద్యాధికారులు కన్నెత్తి కూడా చూడటంలేదని, 31 మంది పరిస్థితి ఎమౌతుందో అని భయపడుతున్నారు.