ప్రధాని మోడీ ఈరోజు అమెరికా బయలుదేరి వెళ్లారు. ఈనెల 23 న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తోనూ, ఆ తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తోనూ ప్రధాని సమావేశం కానున్నారు. ఇతర దేశాలకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా వాక్సిన్ తీసుకొని ఉండాలి. అందులోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందిన ఏడు రకాల వ్యాక్సిన్లలో ఏదో ఒకటి తీసుకొని ఉండాలి. ఇండియాలో సొంతంగా అభివృద్ధి చేసిన కోవాక్సీన్ ను ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటి వరకు గుర్తించలేదు. ఇండియాలో తయారైన ఈ వ్యాక్సిన్ ను ప్రధానితో పాటుగా అనేక…
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌తో చెక్ పెట్టే ప్రక్రియ కొనసాగుతోంది.. సాధ్యమైనంత త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న ప్రణాళికలతో ముందుకు వెళ్తోన్న ప్రభుత్వం.. వ్యాక్సిన్ల కొరతకు తీర్చేందుకు స్వదేశీ వ్యాక్సిన్లకు తోడు విదేశీ వ్యాక్సిన్లకు కూడా అనుమతి ఇస్తూ వస్తోంది.. ఇక, ఈ నేపథ్యంలో కరోనా బారిన పడి కోలుకున్న వాళ్లకు ఐసీఎంఆర్ అధ్యయనం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది.. ఇప్పటికే కోవిడ్ సోకినవాళ్లు కోవాగ్జిన్.. వ్యాక్సిన్ ఒక్క డోసు తీసుకున్నా చాలని చెబుతోంది ఐసీఎంఆర్.. కోవిడ్ సోకని వాళ్లు…
దేశంలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. వ్యాక్సినేషన్‌ను వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. తీవ్రత పెరుగుతుండటంతో ఒకే వ్యాక్సిన్ రెండు డోసుల కంటే మిశ్రమ వ్యాక్సిన్ విధానం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే అంశంపై ఐసీఎంఆర్ పరిశోధన నిర్వహించింది. ఒక డోసు కోవీషీల్డ్, మరో డోసు కోవాగ్జిన్ టీకాలు పొందిన వారికి, రెండు డోసులూ ఒకే రకం వ్యాక్సిన్ తీసుకున్న వారికన్నా మెరుగైన రోగనిరోధక రక్షణ లభిస్తోందని తేలింది. ఉత్తర…
కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషనే కీలకంగా మారిపోయింది.. ఇప్పటికే పలు రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి… స్వదేశీ, విదేశీ వ్యాక్సిన్ల సరిఫరా కొనసాగుతోంది.. తాజాగా, అమెరికా సంస్థకు చెందిన సింగిల్ డోస్ వ్యాక్సిన్ కు కూడా భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. మరోవైపు.. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండడంతో… వాటిపై కూడా అధ్యయనాలు కొనసాగుతున్నాయి.. ఇక, స్వదేశీ టీకాలైన కోవిషీల్డ్, కోవాగ్జిన్ కలిపి.. ఒకటే టీకాగా వేస్తే ఫలితాలు ఎలా ఉంటాయని అనేదానిపై భారత వైద్య పరిశోధన…
కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… మొదట ఇతర దేశాలపై ఆధారపడకుండా.. భారత్‌లోనే రెండు వ్యాక్సిన్లు తయారు చేశారు.. ప్రభుత్వ అనుమతితో కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను వేస్తున్నారు.. ఇప్పటికే దేశవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు.. క్రమంగా విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతి ఇచ్చింది భారత్.. అయితే, కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను కలిపి ఒకే డోస్‌గా వేస్తే పరిస్థితి ఏంటి? ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేదానిపై పరిశోధనలకు ఆమోదం లభించింది..…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… కోవిడ్‌పై పోరాటంలో భాగంగా భారత్‌లో ఇప్పటికే 18 ఏళ్లకు పైబడినవారికి వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది.. దాదాపు 43 కోట్ల మందికి టీకా వేశారు. ఇక, 18 ఏళ్లు లోపు వారికి వ్యాక్సిన్ వచ్చేది ఎప్పుడూ..? అని అంతా ఎదురుచూస్తున్నారు.. ఈ నేపథ్యంలో.. కీలక ప్రకటన చేశారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా.. పిల్లల కోసం భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్…
దేశంలో ఇప్పటికే మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటలో ఉన్నాయి. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు 18 ఏళ్లు పైబడిన వారికి అందించేవే. మూడో వేవ్ ప్రమాదం ముంచి ఉందని, చిన్నపిల్లలకు సోకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తుండటంతో చిన్నారులకు అందించే వ్యాక్సిన్‌పై దృష్టిపెట్టారు. భారత్ బయోటెక్ సంస్థ చిన్నారుల కోసం కోవాగ్జిన్ ను తయారు చేస్తున్నది. 2 నుంచి 18 ఏళ్ల వారిపై వ్యాక్సిన్‌ను ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటికే 6-12 ఏళ్ల వయసువారికి సెకండ్ డోస్…
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించాలంటే ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. దేశీయంగా రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా.. టీకాల కొరతకు చెక్ పెట్టేందుకు విదేశీ వ్యాక్సిన్లకు సైతం అనుమతి ఇస్తోంది భారత్… ఇక, వేటి సామర్థ్యం ఎంత? అవి.. డెల్టా వేరియంట్లపై ప్రభావం చూపుతాయా? అనే చర్చ సాగుతోంది.. ఈ తరుణంలో.. కోవాగ్జిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ తుది ఫలితాలను విడుదల చేసింది భారత్ బయోటెక్. ట్రయల్స్‌లో టీకా తీవ్రమైన, మితమైన కేసుల్లో 77.8…
భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను దేశంలో వేగంగా అమలుచేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ను ఇప్పటికే అనేక దేశాలకు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, బ్రెజిల్ 2 కోట్ల వ్యాక్సిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చి, క్యాన్సిల్ చేసుకున్నది. ఈ డీల్ విలువ 324 మిలియన్ డాలర్లు. అయితే, వ్యాక్సిన్‌కు బ్రెజిల్‌లో అనుమతులు లేకపోవడం, బ్రెజిల్ అధ్యక్షుడిపై ఒత్తిడి రావడంతో ఈ డీల్‌ను క్యాన్సిల్ చేసుకోవడంపై కోవాగ్జిన్ వివరణ ఇచ్చింది. అన్నిదేశాలతో ఒప్పందం…
భారత్ బయోటెక్… బ్రెజిల్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం… ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందంలో బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కోవాగ్జిన్ సరఫరాలో అవినీతి జరిగిందనే కోణంలో పార్లమెంటరీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ దృష్టి సారించింది. బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో ప్రత్యేక ఆసక్తి కనబర్చారని, సన్నిహితులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు చెందిన ఫైజర్, చైనాకు చెందిన సినోవాక్‌ను కాదని… బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థల అనుమతి లేని……