కోవాగ్జిన్‌కు అమెరికా కితాబు.. ఆ వేరియింట్లపై కూడా సమర్థవంతంగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్‌కు కితాబు ఇచ్చింది అమెరికా… కరోనాతో పాటు తాజాగా.. భారత్‌లో వెలుగుచూసిన ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది. కోవాగ్జిన్‌పై టీకాలపై అధ్యయనం నిర్వహించిన అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్… ఎస్‌ఏఆర్‌ఎస్-సీవోవీ-2 ఆల్ఫా, డెల్టా వేరియంట్లను కోవాగ్జిన్ చాలా ప్రభావవంతంగా ఎదుర్కొంటుందని తేల్చింది.. ఈ వ్యాక్సిన్ తీసుకున్న కొందరి నమూనాలను సేకరించి అధ్యయనం చేసిన ఎన్‌ఐహెచ్.. ఆల్ఫా లేదా బీ.1.1.7, డెల్టా లేదా బీ.1.617 వేరియంట్లపై మెరుగ్గా పనిచేస్తూ.. ఫలితాలను ఇచ్చినట్టు గుర్తించారు. కోవాగ్జిన్ కరోనా వేరియంట్లను నిర్వీర్యం చేయడంతో పాటు యాంటీబాడీలు ఉత్పత్తి చేసినట్లు గుర్తించింది ఎన్‌ఐహెచ్.
కరోనా లక్షణాలున్న వారిపై కోవాగ్జిన్ వ్యాక్సిన్ 78 శాతం ప్రభావం చూపినట్లు మూడో దశ ఫలితాల్లో తేలిసన విషయం తెలిసిందే కాగా.. ఈ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఏ ప్రమాదం లేదని అగ్రరాజ్యం అమెరికాకు చెందిన సంస్థ తెలిపింది. కాగా, ఆల్ఫా వేరియంట్‌ను తొలిసారి బ్రిటన్‌లో గుర్తించగా, డెల్టా వేరియంట్ తొలిసారి భారత్‌లో వెలుగుచూసిన విషయం విదితమే. మరోవైపు.. గతంలో, కోవిషీల్డ్ మరియు కోవాగ్జిన్ SARS-CoV-2 వేరియంట్ల ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టాకు వ్యతిరేకంగా పనిచేస్తాయని కేంద్రం పేర్కొంది.. డెల్టా ప్లస్ వేరియంట్‌పై దాని ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించింది. కరోనావైరస్ వ్యాధికి సంబంధించిన నాలుగు రకాలు, ఆల్ఫా, బీటా, గామా మరియు డెల్టా ఉన్నాయి. ఇక, కోవాగ్జిన్‌పై ఎన్‌ఐహెచ్ అధ్యయన ఫలితాలతో.. ఆ వ్యాక్సిన్‌కు అమెరికాలోనూ గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశం ఉంది.
Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
- Saudi-Houthi War: ‘‘పాక్, టర్కీ వస్తే మాకేంటి.?’’ సౌదీపై తగ్గని హౌతీల దాడులు..
తాజావార్తలు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!