కరోనా కట్టడికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ప్రస్తుతం ఇతర దేశాల వ్యాక్సిన్లు కూడా అందుబాటులోకి వస్తుండగా.. ముందుగా.. భారత్‌లోనే రెండు వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చింది సర్కార్.. ఇప్పటికే కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు విస్తృతంగా వేస్తున్నారు.. ఇక, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ మూడో దశ ప్రయోగాలకు సంబంధించిన డేటాను సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ (ఎస్‌ఈసీ) ఆమోదించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకి కంపెనీ సమర్పించిన డేటా ప్రకారం మూడోదశలో కోవాగ్జిన్ 77.8 శాతం సామర్థ్యం ఉంది.. కరోనాకు వ్యతిరేకంగా 77.8 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోంది ఈ వ్యాక్సిన్.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడించాల్సి ఉంది.