కరోనా మహమ్మారిలో అనేక కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు ఇప్పటికే అనేక టీకాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త వ్యాక్సిన్ల కోసం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ వైరస్‌లో తరచుగా ఉత్పరివర్తనాలు జరగుతుండటంతో వ్యాక్సిన్లు వాటిపై ఎంత వరకు పనిచేస్తున్నాయి అనే దానిపై నిత్యం పరిశోధకులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. భారత్‌లో తయారైన కోవాగ్జిన్ వ్యాక్సిన్ పనితీరుపై అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కోవాగ్జిన్ సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, కోవాగ్జిన్ పనితీరు బాగుందని రిపోర్టులు వస్తున్నా, యూరప్ దేశాల్లో దీనిని వ్యాక్సిన్‌గా గుర్తించకపోవడంతో అయోమయం నెలకొన్నది.
Read: తీవ్ర విషాదంలో ‘సాహో’ నటి