Gyanvapi case: జ్ఞానవాపి మసీదులో సర్వేపై ఉత్కంఠ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi case: జ్ఞానవాపి మసీదులో ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ASIతో సర్వే చేయించాలన్న వారణిసి జిల్లా కోర్టు ఆదేశాలపై అలహాబాద్ హైకోర్టు స్టే ఇచ్చిన స్టే ఇవాళ్టితో ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం ఈ అంశంపై విచారణ జరుపుతామని తెలిపింది హైకోర్టు. శివాలయాన్ని ధ్వంసం చేసి… జ్ఞానవాపి మసీదును నిర్మించారన్నది హిందువుల వాదన. దీంతో ఈ విషయంపై సర్వే నిర్వహించాలని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను వారణిసి జిల్లా కోర్ట్ ఆదేశించింది. అయితే దీనిని అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేసింది అంజుమన్ ఇంతెజామియా మసీదు. దీంతో మసీదులో సర్వే ఎలా జరుగుతుందనే వివరాలను తెలుసుకోడానికి వారణాసి నుంచి ASI అధికారిని పిలిపించింది కోర్టు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
సర్వే కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తామని, నిర్మాణానికి ఎలాంటి నష్టం ఉండబోదని ASI అధికారి తెలిపారు. సర్వే కేవలం 5 శాతం మాత్రమే జరిగిందని, జూలై 31 నాటికి పూర్తవుతుందని వివరించారు. అయితే, శాస్త్రీయ సర్వే వల్ల మసీదు దెబ్బతింటుందని వాదించింది మసీదు కమిటీ. వారణాసి కోర్టు జూలై 21న ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని కోరింది. మరోవైపు… మసీదుకు ఎటువంటి నష్టం జరగదని వాదించారు హిందువుల తరఫు న్యాయవాది. తవ్వకాలు జరపబోమని సొలిసిటర్ జనరల్ సోమవారం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారనే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం జ్ఞానవాపిలో ASI సర్వేపై స్టే విధించింది. ఇవాళ విచారణ కొనసాగిస్తామని తెలిపింది. దీంతో ఇవాళ అలహాబాద్ హైకోర్టు ఏం చెబుతుందోననే ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!