సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) 2022 సంవత్సరానికి సంబంధించిన నివేదికను విడుదల చేసింది. ఈ వార్షిక నివేదికలో, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలోని ఉద్యోగులపై గతేడాది అత్యధికంగా అవినీతి ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది.
అవినీతికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి జీ-20 దేశాల సమిష్టి కృషి తోడ్పడుతుందనీ ప్రధాని మోడీ తెలిపారు. అంతేకాకుండా.. అవినీతికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ అనే కఠినమైన విధానం ఇండియాలో ఉందని జీ-20 సమావేశంలో ప్రధాని తెలిపారు.
కమీషన్ (లంచం) తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.కమీషన్ వసూలు చేశారని ఆరోపించినందుకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ మంత్రి ఆర్ అశోకల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి డీకే శివకుమార్, వారి ఆరోపణలు అవాస్తవమని తేలితే ఇద్దరు బీజేపీ నాయకులు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తారా అంటూ సవాల్ విసిరారు.
అవినీతి నిరోధక శాఖకు రెండు అవినీతి తిమింగలాలు చిక్కాయి. అవినీతి కేసులో ఇద్దరు ప్రభుత్వ అధికారులను అరెస్టు చేయగా.. అస్సాంలోని ధుబ్రి జిల్లాలో ఒకరి నివాసంలో రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధిలో అవినీతి చోటు చేసుకుంది సీఎంఆర్‌ఎఫ్‌లో జరిగిన అవినీతిపై సీఐడీ కేసు నమోదు చేసింది. సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంపై సిఐడి దర్యాప్తులో విస్తుపోయే అంశాలు బయటికి వస్తున్నాయి.
శివసేన (యూబీటీ)కి చెందిన సామ్నా తన తాజా సంపాదకీయంలో రుతుపవనాల సన్నద్ధత, ముంబయిలో వరదల నిర్వహణపై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించింది. అవినీతి కారణంగా నగరం మునిగిపోయిందని పేర్కొంది.
కర్ణాటకలో బీజేపీ సర్కార్ ను 40 శాతం కమీషన్ ప్రభుత్వం అని కాంగ్రెస్ పార్టీ విర్శించింది. ఇప్పుడు కేరళలోని అధికార ఎల్‌డిఎఫ్‌ను కూడా 80 శాతం కమీషన్ పాలనగా అభివర్ణిస్తున్నారు.
రాజస్థాన్ లోని అశోక్ గెహ్లాట్ సర్కార్ మరో సంక్షోభం ఏర్పడింది. ఓవైపు సొంత పార్టీ నేతల మధ్య విభేదాలు, ప్రభుత్వంలోని మంత్రుల తీరుతో గెహ్లాట్ సర్కార్ కు పెద్ద తలనొప్పిగా మారింది. మరి కొద్ది రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి.