Purandeshwari: మద్యం వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలి.. అమిత్ షాకు పురంధేశ్వరి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Purandeshwari Met Amit Shah in Delhi: ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కలిశారు. ఏపీలో మద్యం వ్యవహారంపై అమిత్ షాకు పురంధేశ్వరి వివరించారు. ఏపీలో మద్యం అమ్మకాల్లో అవినీతి జరుగుతుందంటూ.. లిక్కర్ అవినీతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కేంద్ర హోం మంత్రిని కోరారు. అమ్ముడవుతున్న కల్తీ మద్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా భారీ అవినీతికి మద్యం అమ్మకాన్ని ఉపయోగించుకుంటున్నారని అన్నారు. మద్యం అమ్మకాల ద్వారా ముఖ్యమంత్రితో పాటు ఆయన అనుచరులు కోట్ల రూపాయల కొల్లగొడుతున్నారని ఆమె ఆరోపించారు.
Also Read: Bhuma Akhilapriya: ఎమ్మెల్యే శిల్పా రవిపై మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఫైర్
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
మొదట్లో ఆంధ్రప్రదేశ్‌లో వేలం పద్ధతిలో మద్యం దుకాణాలకు అనుమతులు ఉండేవి, ఇప్పుడు ప్రభుత్వమే మద్యం దుకాణాలను రన్ చేస్తుందన్నారు. మద్యం తయారీ నుంచి అమ్మకాల వరకు అవినీతి నెలకొందని, మద్యం తయారీ కంపెనీలను వైసీపీ నేతలే నిర్వహిస్తున్నారని విమర్శించారు. సరైన పద్ధతిలో మద్యం తయారు చేయకపోవడం వల్ల మందు తాగేవాళ్ల ఆరోగ్యం పాడవుతుందని పేర్కొన్నారు. ఒక మద్యం సీసాను 15 రూపాయలకు తయారుచేసి రూ.600 నుంచి రూ.800 వరకు అమ్ముతున్నారని అమిత్ షాకు పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు.
Also Read: Purandeshwari: ఢిల్లీకి బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి.. పొత్తులపై క్లారిటీ రానుందా?
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం వ్యాపారం నగదు రూపంలోనే జరుగుతుందన్నారు. ఏపీలో ప్రతిరోజు 80 లక్షల మంది మద్యం తాగుతున్నారని.. ఒక్కొక్కరు సరాసరిన 200 రూపాయలు మద్యం కోసం వెచ్చిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఏపీలో లిక్కర్ అమ్మకాల్లో భారీ అవినీతి జరుగుతోందని.. నగదు రూపంలో అమ్మకాలు భారీ అవినీతికి కారణం అవుతోందని ఆమె పేర్కొన్నారు. సంవత్సరంలో మొత్తం రూ.57,600 కోట్లు లిక్కర్ అమ్మకాల ద్వారా వస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 32 వేల కోట్లు మాత్రమే చూపిస్తుందని ఆరోపించారు. సంవత్సరానికి 25 వేల కోట్ల భారీ అవినీతి జరుగుతోందని ఆమె ఫిర్యాదు చేశారు. అమాయక ప్రజల జీవితాలను పణంగా పెట్టి భారీగా దోచుకుంటున్నారని అమిత్ షాకు అందజేసిన లేఖలో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
-
Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
-
Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!