మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్.. తెలంగాణ అలర్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగా తగ్గినట్టే తగ్గిన కరోనా వైరస్ కొత్త పాజిటివ్ కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతోంది.. కొన్ని రాష్ట్రాల్లో తక్కువ కేసులు ఉంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.. మరోవైపు మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.. దీంతో.. పొరుగు రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి.. ముఖ్యంగా మహారాష్ట్రలో సెకండ్ వేవ్‌తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి టెస్టులు నిర్వహిస్తున్నారు. ఆ రాష్ట్రం నుంచి తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాకు రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. రెంజల్, బోధన్, నవీపేట, జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, బోధన్ మండలాలు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నాయి. బోధన్ మండలం సాలుర వద్ద చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది థర్మల్ స్కానింగ్ చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్నవారిని ఆసుపత్రికి పంపుతున్నారు.
మరోవైపు… దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్రం కట్టడి చర్యలు ప్రారంభించింది. దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి కేంద్రం ఉన్నతస్థాయి బృందాలను పంపింది. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చూడాలంటూ ఆయా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి లేఖలు రాశారు. ముగ్గురు సభ్యులతో కూడిన బృందాలను మహారాష్ట్ర, కేరళ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు పంపినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Also Read
- Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
- Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
- Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
- Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
తాజావార్తలు
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
CM Vijay: ‘రాజరికం, కుటుంబ పాలనకు TVKలో చోటు లేదు’.. ధారాపురం సభలో విజయ్ కీలక వ్యాఖ్యలు
-
LPG e-KYC: ముగిసిన ఆఖరి గడువు.. ఎల్పీజీ ఇ-కేవైసీ చేయని వాళ్లకు గ్యాస్ వస్తుందా? క్లారిటీ ఇదిగో..
-
Shubman Gill: 405 స్కోర్ చూసి కంగారుపడిపోయా.. ఓటమి తప్పదనుకున్నా.. కానీ.: గిల్
-
India vs West Indies: 55 ఏళ్ల వన్డే క్రికెట్ చరిత్రలోనే తొలిసారి.. హిస్టరీని తిరగరాసిన భారత్, వెస్టిండీస్..!
ట్రెండింగ్
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!