కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అనకాపల్లి మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూశారు. ఈనెల 15 వ తేదీన సబ్బం హరి కరోనా బారిన పడ్డారు. మూడోరోజులపాటు సబ్బం హరి హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తరువాత వైద్యుల సలహామేరకు ఆయన విశాఖ అపోలో ఆసుపత్రిలో చేరారు. కరోనాతో పాటుగా ఆయనకు పలు ఇన్ఫెక్షన్లు సోకడంతో పరిస్థితి విషమించింది. వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితమే మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. జూన్ 1, 1952 లో జన్మించిన సబ్బం హరి 1995 లో విశాఖపట్నానికి మేయర్ గా ఎంపికయ్యారు. మేయర్ గా పనిచేసిన సమయంలో విశాఖ అభివృద్ధికి కృషిచేశారు. 15 వ లోక్ సభకు విశాఖ జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి విజయం సాధించారు.