కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో.. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య తయారు చేస్తున్న కరోనా మందుపై పెద్ద చర్చే జరిగింది.. ప్రభుత్వం జోక్యం చేసుకోవడం.. ఆ మందను పరిశీలించడం.. వ్యవహారం హైకోర్టు వరకు వెళ్లడం.. ప్రభుత్వం ఆనందయ్య మందుకు అనుమతి ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి.. అయితే, తాజాగా.. ఆనందయ్య మందుపై మద్రాసు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనాకు మందు తయారుచేసి ఉచితంగా ఇస్తున్నారంటూ ఆనందయ్యను అభినందించింది మద్రాసు హైకోర్టు.. ఆనందయ్యకు న్యాయమూర్తులు జస్టిస్…
కరోనా కాలంలో మాస్క్ ధరించడం కామన్ అయింది. మాస్క్‌లేకుండా బయటకు వస్తే కరోనా నుంచి ప్రమాదం పొంచి ఉన్నది. దీంతో దాదాపుగా ప్రజలు మాస్క్ లేకుండా బయటకు వచ్చేందుకు ఇష్టపడటంలేదు. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది మాస్క్ పెట్టుకోకుండా బయటకు వస్తున్నారు. వీరి నుంచి మిగతావారికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుంది. Read: బీహార్‌లో వింతకేసుః కలలోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడని… అంతేకాకుండా థర్డ్ వేవ్ ముప్పుకూడా పొంచి ఉందనే…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,088 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 9 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే, సమయంలో 1511 మంది కరోనా బాధితులు కోలుకున్నారు.. దీంతో… పాజిటివ్ కేసుల సంఖ్య 6,17,776కు పెరగగా… రికవరీ కేసులు 5,98,139కి చేరగాయి.. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో 3,607 మంది మృతిచెందినట్టు బులెటిన్‌లో…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గింది.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 88,622 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 4,981 మంది పాజిటివ్‌గా తేలింది.. కోవిడ్ బారినపడి మరో 38 మంది మృతిచెందారు.. తాజాగా మృతుల్లో చిత్తూరు జిల్లాలో 10 మంది, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరులో నలుగురు చొప్పున, శ్రీకాకుళం, పశ్చిమగోదావరిలో ముగ్గురు చొప్పు. అనంతపూర్, కడప, విశాఖపట్నం,…
ఏపీ ప్రభుత్వ అఫిడవిట్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. సరైన అధ్యాయం కసరత్తు లేకుండా పరీక్షలకు వెళ్తే విద్యార్థులు, సిబ్బంది ప్రమాదంలో పడతారు. అన్ని అంశాలపై అఫిడవిట్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సోమవారం అఫిడవిట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వలని ఏపీ ప్రభుత్వం కోరింది. రేపే అఫిడవిట్ దాఖలు చేయాలన్న సుప్రీంకోర్టు… ఇతర బోర్డుల ఫలితాలు ముందుగా వస్తే విద్యార్థులకు ఇబ్బంది కాదా అని ప్రశ్నించింది. పరిక్షల నిర్వహణ పై యూజిసీ,సీబీఎస్ఈ, ఐసిఎస్ఈ…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1114 కరోనా కేసులు, 12 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 616688 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక ఈరోజు కరోనా నుంచి కోలుకున్న వారు 1280 మంది కాగా.. ఇప్పటివరకు మొత్తం 5,96628 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 3598 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ప్రస్తుతం 16,492 యాక్టివ్ కేసులు…
ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి సుప్రీం కోర్టు లో ఏపీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించడం మినహాయించి, ఇంకో విశ్వసించదగ్గ సరైన ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. పాఠశాలలు నిర్వహించే “ఇంటర్నల్ పరీక్షల” పై ఇంటర్మీడియట్ బోర్డు కు అజమాయిషీ లేదు. కాబట్టి, “ఇంటర్నల్ పరీక్షల” ఆధారంగా సరైన రీతిలో ఖచ్చితమైన విద్యార్దుల ఉత్తీర్ణతలను నిర్ణయించలేం అని తెలిపింది. 2007, 2011 సంవత్సరాలలో (EAPCET) కామన్ ఎంట్రన్స్ పరీక్షల్లో 25 శాతం వైటేజ్…
రాష్ట్రంలో కరోనా కేసులు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా ట్రీట్‌మెంట్ చేస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్స, పరీక్షల గరిష్ట ధరలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబందించి జీవో 40ని జారీ చేసింది. ఈ జీవో ప్రకారం నిర్ణయించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం సూచించింది. Read: థర్డ్‌వేవ్ తప్పదు… ఆ రెండు నెలల్లోనే ! సాధారణ వార్డుల్లో ఐసోలేషన్, పరీక్షలకు గరిష్టంగా రూ.4వేలు,ఐసీయూలో గరిష్టంగా…