తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా కిందికి దిగుతున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 917 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 10 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 1,006 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,23,510కు చేరగా.. రికవరీ కేసులు 6,06,461కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య…
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గుతుంది. తాజాగా రాష్ట్రంలో 3,797 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,89,513 కి చేరింది. ఇందులో 18,38,469 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 38,338 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 35 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,706 కి చేరింది. ఇకపోతే గడిచిన…
దేశం సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కేసులు తగ్గుముఖం పడుతుండటంతో తిరిగి ప్రజాజీవనం సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ను దాదాపుగా ఎత్తివేశారు. సెకండ్ వేవ్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. సోమవారం నుంచి రవాణా వ్యవస్థను పునరుద్దరించారు. తమిళనాడు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. తమిళనాడులోని 27 జిల్లాల్లో 19,920 బస్సలు రోడ్డెక్కాయి. దీంతో తమిళనాడులో ఒక్కరోజులో 22…
కరోనా మహమ్మారిలో అనేక కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు ఇప్పటికే అనేక టీకాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్త వ్యాక్సిన్ల కోసం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ వైరస్‌లో తరచుగా ఉత్పరివర్తనాలు జరగుతుండటంతో వ్యాక్సిన్లు వాటిపై ఎంత వరకు పనిచేస్తున్నాయి అనే దానిపై నిత్యం పరిశోధకులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. భారత్‌లో తయారైన కోవాగ్జిన్ వ్యాక్సిన్ పనితీరుపై అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై…
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటోంది. దేశంలో ప్రస్తుతం మూడు రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు లక్షల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే, డిమాండ్‌కు సరిపడినన్ని వ్యాక్సిన్లు లేకపోవడంతో అత్యవసర వినియోగం కింద మరో వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకోవడానికి అనుమతులు లభించినట్టు సమాచారం. కరోనా మహమ్మారిపై సమర్ధవంతంగా పనిచేస్తున్న మోడెర్నా వ్యాక్సిన్‌ను ఇండియాలో దిగుమతి, అమ్మకాల కోసం ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా డీసీజీఐ కు ధరఖాస్తు చేసుకోగా, అనుమతులు మంజూరు చేసినట్లు…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గిపోయింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71,758 సాంపిల్స్ పరీక్షించగా… 2,224 మందికి పాజిటివ్‌గా తేలింది.. మహమ్మారితో మరో 31 మంది ప్రాణాలు కోల్పోయారు.. చిత్తూరులో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున, అనంతపూర్, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ఇక, విశాఖ, విజయనగరం జిల్లాలో…
కరోనా మహమ్మారి అడవుల్లో అన్నలను కూడా తాకింది.. పెద్ద సంఖ్యలో మావోయిస్టులు కరోనా బారినపడ్డారు.. వారు జనజీవన స్రవంతిలో కలిసిపోతే వారికి సరైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు.. అయితే, పోలీసుల ప్రకటను తీవ్రంగా ఖండిస్తున్నారు మావోయిస్టులు.. ఈ మేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ లేఖ విడుదల చేశారు.. కామ్రేడ్ శారద, ఇడ్మా ఆరోగ్యంగానే ఉన్నారని. పాలకులు, ప్రభుత్వాలు కావాలనే దుష్పాచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.. వాటిని నమ్మి కుటుంబ…
ఏపీలోని 8 జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 5శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలించారు. రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేయడానికి సమయం ఇచ్చారు. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూ కొనసాగనుంది. ఉభయగోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సాయంత్రం 6 గంటలవరకే సడలించారు. ఈ జిల్లాల్లో సాయంత్రం…
ఆక్స్‌ఫర్ట్-అస్త్రాజెనకా సంయుక్తంగా అభివృద్దిచేసిన కోవిడ్ వ్యాక్సిన్‌ను ఇండియాలో సీరం ఇనిస్టిట్యూట్ సంస్థ కోవీషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్‌ను అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నది. ఇక ఇదిలా ఉంటే, జులై 1 వ తేదీ నుంచి ఈయూ గ్రీన్ పాస్‌లను జారీ చేయబోతున్నది. గ్రీన్ పాస్‌లకు అర్హత కలిగిన వాటిల్లో కోవీషీల్డ్ వ్యాక్సిన్ పేరు లేకపోవడంతో సీరం సంస్థ షాక్ అయింది. దీంతో ఈయూలో ప్రయాణం చేసే భారతీయులకు గ్రీన్ పాస్ లభించే అవకాశం…