కరోనా ఆంక్షల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కున్న ప్రవాస భారతీయుల కోసం ఇండియన్ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను చేపట్టేందుకు సిద్దం అయింది. గల్ఫ్‌లోని కువైట్‌లో చిక్కుకున్న భారతీయులు తిరిగి ప్రయాణాలు సాగించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించబోతున్నది. ప్రయాణికులపై విధించిన ఆంక్షలను ఆగస్ట్1 నుంచి కువైట్ ప్రభుత్వం ఎత్తివేస్తున్నది.
Read: ‘ఇండియా’ వద్దు… ‘భారత్’ ముద్దు అంటున్న కంగనా!
దీంతో ప్రయాణాలు సాగించే భారతీయులకు అవసరమైన వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ సర్టిఫికెట్‌లను అందజేసేందుకు కువైట్‌లోని భారతీయ ఎంబసీ కార్యాలయం ఏర్పాట్లు చేస్తున్నది. కువైట్ ప్రభుత్వంతో సమన్వయమై ఈ స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహించబోతున్నది. దీనికోసం ప్రయాణికులు https://forms.gle/ZgRpFBTFV5V24Vqb8 లింక్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని కొరింది. ఈ పోర్టల్లో పేరు నమోదు చేసుకుంటే వారికి అవసరమైన వ్యాక్సిన్, సర్టిఫికెట్‌లను అందజేస్తామని భారతీయ ఎంబసీ అధికారులు పేర్కొన్నారు.