ఇరాక్‌లోని ఓ కోవిడ్ ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో 50 మంది మృతి చెందారు. మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వివరాల్లోకి వెళ్తే…ఇరాక్‌లోని నసీరియా పట్టణంలోని అల్ హుస్సేన్ అనే కోవిడ్ ఆసుపత్రిలో ఆక్సీజన్ ట్యాంక్ పేలింది. ఈ పెలుడు కారణంగా మంటలు పెద్దఎత్తున వ్యాపించాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు కరోనా రోగులు చికిత్స పొందుతున్న కోవిడ్ వార్డుకు వ్యాపించాయి. Read: పుకార్లకు చెక్ పెట్టిన తలైవి…
దేశంలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మరలా పెరుగుతున్నాయి. దేశంలోని 8 రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. కేరళ, మహారాష్ట్రతో పాటుగా అటు ఈశాన్య రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, మణిపూర్ రాష్ట్రాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇక త్రిపురలో డెల్టాప్లస్ వేరియంట్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో కేంద్రం అప్రమత్తం అయింది. Read: తెలకపల్లి రవి : వరస ఎన్నికలకు బిజెపి ఆరెస్సెస్ రెడీ, మోడీ ఇమేజి…
పర్యాటక ప్రదేశాల వద్ద జనం గుమికూడవద్దు. “కోవిడ్” ప్రవర్తనా నియమాలను పాటించాలి అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మాస్కు ధరించి , భౌతిక దూరం పాటించాలి. కేవలం అధికార యంత్రాంగమే కాదు, ప్రజల భాగస్వామ్యంతోనే “కరోనా”ను జయించవచ్చు. ఇక స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు అయిన సందర్భంగా దేశ చారిత్రక సంపదను డిజిటలైజేషన్ చేస్తున్నాం అని తెలిపారు. 18 కోట్ల డాక్యుమెంట్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పురాతన, చారిత్రక సంపద ను…
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 465 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 04 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 869 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,683 కు చేరగా.. రికవరీ కేసులు 6,17,638 కు…
అక్రమార్కుల భరతం పడతామని కొరడా బయటకు తీశారు. దూకుడుగా వెళ్లారు కూడా. ఇంతలో ఏమైందో ఏమో ఉలుకు లేదు పలుకు లేదు. ఎక్కడివారు అక్కడే గప్‌చుప్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోన్న ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. నాడు గంభీరమైన ప్రకటనలు.. నేడు పత్తా లేరు! తప్పు చేస్తే తాట తీస్తాం. ఎంతటి వారైనా వదిలేదు లేదు. కటకటాల వెనక్కి నెట్టడం ఖాయం. కరోనా సమయంలో నిజమాబాద్ జిల్లా ఉన్నతాధికారులు గంభీరంగా పలికిన…
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో డిప్యుటేషన్ల రగడ కలకలం రేపుతోంది. కరోనా పీక్‌లో ఉన్న సమయంలో తమ పనితీరుతో మంచిపేరు తెచ్చుకున్న వారికి ఆ నిర్ణయం మింగుడు పడటం లేదట. కానీ.. అసలు విషయం తెలుసుకుని ఎక్కడివారు అక్కడే గప్‌చుప్ అయ్యారట. అదే ఇప్పుడు ఆ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. డిప్యుటేషన్ల రద్దుతో వైద్యశాఖలో కలకలం వైద్యశాఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్…
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 2,925 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,20,178 కు చేరింది. ఇందులో 18,77,930 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 29,262 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 26 మంది…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా దిగివస్తున్నాయి… రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రంలో 729 పాజిటివ్ కేసులు నమోదు కాగా… మరో ఆరుగురు కోవిడ్ బాధితులు మృతిచెందారు… ఇక, ఇదే సమయంలో 987 కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,30,514కు చేరుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 6,15,852కు పెరిగాయి… మృతుల సంఖ్య 987కు చేరింది.. ప్రస్తుతం…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా లక్షా 13 సాంపిల్స్ పరీక్షించగా.. 3,040 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 14 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. తూర్పు గోదావరిలో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, అనంతపూర్, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 4,576 మంది పూర్తిస్థాయిలో…