ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టినా.. కేసులు ఒకరోజు ఎక్కవగా.. మరో రోజు తక్కువగా వెలుగుచూస్తున్నాయి.. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 74,820 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 2,174 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 18 మంది కరోనాతో మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 2,737 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షించిన శాంపిల్స్…
భారత్ కరోనా కేసుల తీవ్రత కొనసాగుతూనే ఉంది… కాకపోతే.. రోజువారి కేసుల్లో హెచ్చుతగ్గులు మాత్రం నమోదు అవుతున్నాయి… కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 39,097 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 546 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు.. ఇదే సమయంలో.. 35,087 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,32,159కు చేరుకోగా… రికవరీ…
తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,20,530 శాంపిల్స్ పరీక్షించగా.. 643 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో నలుగురు కోవిడ్ బాధితులు మృతిచెందగా.. తాజాగా 767 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,40,012కు చేరుకోగా.. ఇప్పటి వరకు కరోనాతో 3,778 మంది మృతిచెందారు.. 6,26,505 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. రాష్ట్రంలో రికవరీ…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతూ వచ్చినా.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి.. పశ్చిమగోదావరి జిల్లా అల్లవరంలోనూ కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది.. దీంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. ఈ నెల 31 తేదీ వరకు కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.. అల్లవరంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు, వ్యాపార సముదాయాలు పనియేనుండగా.. మధ్యాహ్నం 2…
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వదిలిపెట్టలేదు. వ్యాక్సిన్‌ను వేగంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కేసులు తగ్గినట్టుగానే తగ్గి మరలా అధిక సంఖ్యలో నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, బ్రెజిల్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిపై కరోనా విజృభిస్తున్నది. వీరికి కరోనా సోకితే ముప్పు తీవ్రత అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. మధుమేహం బాధితులకు కరోనా సోకితే ముప్పు…
ఏపీలో దాదాపు అన్ని జిల్లాలో కరోనా కేసులు తగ్గాయి. కాని తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కేసులు అదుపులోకి రావడం లేదు. దీంతో కారణాలపై ప్రభుత్వం ఆరా తీస్తుండడంతో అధికారులు ఇప్పుడు పరుగులు తీస్తున్నారు. గడచిన కొన్ని వారాలుగా పాజిటివ్ జిల్లా తొలి స్థానంలో కొనసాగుతుండడంతో ఎందుకిలా అనే దానిపై సమీక్ష నిర్వహిస్తున్నారు. గడిచిన ఇరవై రోజుల్లో జిల్లాలో 10,944 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ఫ్యూ వేళలు పొడిగించారు. చింతూరు, పి.గన్నవరం మండలాల్లో మధ్యాహ్నం రెండు నుంచి…
ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 86,280 సాంపిల్స్ పరీక్షించగా.. 2,527 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 19 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,412 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,46,749 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,09,613 కి చేరింది..…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 88,149 శాంపిల్స్ పరీక్షించగా.. 2,498 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 24 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు… తాజా మృతుల్లో చిత్తూరులో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరులో ఇద్దరు చొప్పున, కృ ష్ణ, కర్నూలు, శ్రీకాకుళంలో…
బెజవాడలో నేటి నుండి ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కాయి. కరోనా కారణంగా రద్దయిన రైళ్లు ఈరోజు నుండి ప్రారంభం అయ్యాయి. కానీ ఈ ప్యాసింజర్ రైళ్లలో ఎక్స్ ప్రెస్ చార్జీల మోత మోగుతుంది. ఇకపై 30 నుండి 200 శాతం అదనంగా టికెట్ ధర వసూలు చేయనున్నారు. ఇప్పటికే కొన్ని ప్యాసింజర్ రైళ్లను ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మార్చారు. అయితే పెరిగిన ఈ టికెట్ ధరలతో వలస కార్మికులకు, మధ్యతరగతి ప్రజలపై మొయ్యలేని భారం పడుతుంది. ఇక పెరుగుతున్న…
యూరప్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతుండటంతో వరదనీరు యూరప్‌లోని బెల్జియం, జర్మనీ దేశాలను ముంచెత్తింది. ఈ వరదల కారణంగా ఇప్పటికే 200 మందికి పైగా మృతిచెందినట్టు సమాచారం. వందల మంది వరదనీటిలో కొట్టుకుపోయారని, వారి ఆచూకీ కోసం డిజాస్టర్ టీమ్, ఆర్మీ బృందాలు గాలిస్తున్నాయని జర్మనీ అధికారులు చెబుతున్నారు. ఈ వరదల ప్రభావం జర్మనీలోని అహాల్వర్ కౌంటీ, రైన్లాండ్-పలాటినేట్, నార్ట్రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నది. ఇప్పటికే జర్మనీ కరోనా తో…