ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది మాయదారి కరోనావైరస్.. ఎప్పటికప్పుడు రూపాంతరాలు చెందుతూ ప్రజలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది.. డెల్టా వేరియంట్ రూపంలో భారత్‌లో సెకండ్ వేవ్ విధ్వంసమే సృష్టించగా.. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో పంజా విసురుతోంది.. ఇప్పటికే దేశంలో కరోనా థర్డ్ వే ప్రారంభమై పోయింది.. 15 రాష్ట్రాల్లో థర్డ్‌వేవ్ స్టార్ట్ అయినట్టు వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఓవైపు డెల్టా వేరియంట్, మరోవైపు ఒమిక్రాన్ ఇప్పుడు క్రమంగా కేసులు పెరగడానికి కారణం అవుతున్నాయి… మూడు, నాలుగు రోజుల క్రితం 20 వేలలోపు ఉన్న కేసులు ఇప్పుడు లక్ష వైపు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. వర్చువల్ పద్దతితో ఇవాళ సీఎంలతో భేటీకానున్న ప్రధాని.. ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు, ఒమిక్రాన్ పరిస్థితి, కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్షించనున్నారు.. అలాగే ఏం చేస్తే బాగుంటుంది అనేదానిపై కూడా రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయనున్నారు ప్రధాని మోడీ..
Read Also: జనవరి 7, శుక్రవారం దినఫలాలు…
ఇక, కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది కేంద్రం.. కోవిడ్ ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలు కూడా రాసింది.. అంతేకాకుండా జిల్లా, సబ్ డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని, ఆస్పత్రుల్లో సిబ్బంది మౌలిక వసతులు, పడకల లభ్యత చూసకోవాలని సూచించింది. మరోవైపు, రాష్ట్రాల ప్రభుత్వాలు మళ్లీ కఠిన ఆంక్షలు, కంటైన్‌మెంట్ జోన్లు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్ష సమావేశం కీలకంగా మారింది… ఈ భేటీలో ఆర్ధిక పరిస్థితిపైనా ప్రధాని చర్చించనున్నారు. ప్రస్తుతం దేశంలో దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో విద్యార్థులకు కూడా కరోనా సోకుతుంటే… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టెన్షన్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రధాని రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వనున్నారు. మరింత కఠినమైన ఆంక్షలు విధిస్తారా..? లాక్‌డౌన్ వైపు అడుగులు వేస్తారా..? రాష్ట్రాలకే నిర్ణయాన్ని వదిలేస్తారా..? అనేది ఆసక్తికరంగా మారింది.