ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఈ మేరకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆరోగ్య కార్యకర్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా నర్సాపూర్‌లో మెప్మా సిబ్బంది, ఆశా కార్యకర్తలు వినూత్న ప్రచారం చేపట్టారు. కరోనా రెండు డోసుల టీకాలు తీసుకోకపోతే రేషన్, పెన్షన్ పంపిణీ నిలిపివేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. Read Also: హైదరాబాద్‌లో మెగా…
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో తెలంగాణ మరో మైలురాయిని చేరుకుంది. రాష్ట్రంలో గురువారం ఉదయం వరకు 4 కోట్ల టీకా డోసుల పంపిణీ పూర్తయింది. ఈ ఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. ఈ ప్రక్రియ మొదలుపెట్టిన 165 రోజుల్లో కోటి డోసులు, 233 రోజుల్లోనే రెండు కోట్ల డోసులను, 260 రోజుల్లోనే మూడు కోట్ల డోసులను అధికారులు పూర్తి చేశారు. ఇప్పటివరకు రాష్ట్ర జనాభాలో 18 ఏళ్లు నిండిన 94% మందికి ఫస్ట్ డోస్,…
కరోనా విశ్వమంతా కల్లోలం కలిగిస్తోంది. ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మాస్క్, వ్యాక్సిన్ తప్పనిసరి. దేశవ్యాప్తంగా 127 కోట్లమందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కానీ కొందరు మాత్రం తమ వైఖరి మార్చుకోవడం లేదు. జగిత్యాలలో కరోనా వ్యాక్సిన్ వేసుకోనంటూ ఓ వ్యక్తి హంగామా చేసిన వీడియో వైరల్ గా మారింది. READ ALSO:ఈ బామ్మలు సమ్‌థింగ్ స్పెషల్.. ఎందుకో తెలుసా? ఊరు వదిలైనా వెళ్తా కాని వ్యాక్సిన్ వేసుకోనంటూ వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.…
వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఇందులో జాతీయ సగటును మించి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఉంది అని తెలిపిన అయన… వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక శనివారం జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే కరోనా తగ్గుముఖం పట్టడంతో 350 పడకలు గల కింగ్ కోఠి జిల్లా దవాఖానలో సాధారణ వైద్యసేవలు పునరుద్ధరణ చేయనున్నారు. టిమ్స్ హాస్పిటల్‌లో 200 పడకలు మినహా సాధారణ వైద్య…
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టినాటి నుంచి టీఎస్ ఆర్టీసీని అభివృద్ధి చేసేందుకు తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు సజ్జనార్. ఆయన బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కొత్త ఆలోచనలతో ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ పై దృష్టి పెట్టే విధంగా చేస్తున్నారు. నూతన సంస్కరణలతో ఆర్టీసీ లాభాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా మరో కీలక విషయాన్ని సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీలో ఉన్న ఉద్యోగులకు వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. 48,214 మంది ఉద్యోగులతో పాటు 5,034…
ఒకటి కాదు రెండు కాదు.. వంద కోట్ల టీకాలు భారతజాతి ప్రపంచానికి చాటిన ఐక్యతా అంశం. ‘మన్ కీ బాత్’ 82 వ రేడియో ఎడిషన్‌లో ఈరోజు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లు ఇవ్వడం భారతదేశ శక్తిని అందరికీ చూపించిందన్నారు మోడీ. కరోనాపై పోరులో ఇదో మైలురాయి అని ప్రధాని మోడీ అన్నారు. వ్యాక్సిన్లు అందరికీ అందిస్తామన్నారు. అసాధ్యం అని భావించిన ఈ విజయం తర్వాత…
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ దూసుకుపోతున్న వేళ.. డబ్ల్యూహెచ్‌వో ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పూర్తి చేసిన తొలి దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. దీంతో భారత్‌ను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అభినందించారు. 100 కోట్ల డోసులను పంపిణీ చేసి భారత్ చరిత్ర లిఖించిందంటూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్‌ను టెడ్రోస్ అథనోమ్ రీట్వీట్ చేశారు. కరోనా వైరస్ ముప్పు పొంచి ఉన్న వేళ ప్రజలను…
కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన వినాశనం ఇంకా మన కళ్లలో మెదులుతూనే ఉంది. ఆ పాపంలో ప్రభుత్వాల పాత్ర కూడా ఉంది. ఎన్నికల సభలు సూపర్ స్ప్రెడర్స్ గా మారాయి. తెలంగాణలో కరోనా కేసుల పెరుగుదలకు నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కూడా ఒక కారణం. ఇప్పుడు థర్డ్ వేవ్ పొంచి ఉన్న సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరుగుతోంది. హుజూరాబాద్‌లో ప్రధాన ప్రత్యర్థులు ప్రచార వేగం పెంచారు. నేతల వెంట జనం గుంపులు గంపులుగా తిరుగుతున్నారు.…
కరోనాను తరిమేసేందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. సాధ్యమైనంత త్వరలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నాయి ప్రభుత్వాలు.. ఇందులో భాగంగా రెగ్యులర్‌గా ప్రభుత్వ ఆస్పత్రలు, పీహెచ్‌సీ సెంటర్లలో.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ సాగుతున్నా.. మరింత విస్తృతంగా వ్యాక్సిన్ వేయాలన్న ఉద్దేశంతో.. జీహెచ్‌ఎంసీ కంటోన్మెంట్ ఏరియాలలో కోవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఈ నెల 23వ తేదీ నుండి 10-15 రోజుల పాటు ఈ స్పెషల్…
కరోనా మహమ్మారికి చెక్‌పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్… దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది… మొదటల్లో ప్రజల్లో భయం ఉన్నా.. క్రమంగా వ్యాక్సిన్ సెంటర్లకు వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. ఇక, వ్యాక్సిన్ల కొరతతో కొంత కాలం తెలంగాణలో వ్యాక్సిన్ వేయడమే నిలిపివేసిన పరిస్థితి.. కానీ, ఇప్పుడు రాష్ట్రంలోనూ వ్యాక్సినేషన్ చురుకుగా సాగుతోంది.. రాష్ట్రంలో నేటితో కోటి డోసులు పూర్తి చేసినట్టు ఆరోగ్యశాఖ ప్రకటించింది.. ఇప్పటి వరకు తెలంగాణలో 1,00,53,358 డోసుల వాక్సినేషన్ వేశామని… అందులో…