ఏపీలో ఈరోజు 6 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు చేరుకున్నాయి. అయితే వాటిని జిల్లాలకు పంపిణీ చేసింది వైద్యారోగ్య శాఖ. ఇక ప్రాధాన్యతల వారీగా కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ సిబ్బందికి కరోనా వాక్సినేషనులో హై ప్రయార్టీ ఇవ్వాలని ప్రభుత్వం తెలిపింది. సీఎం ఆదేశాల మేరకు ఫ్రంట్ లైన్ వర్కర్లకు.. హెల్త్ కేర్ వర్కర్లకు వచ్చే 72 గంటల్లో వంద శాతం మేర వ్యాక్సినేషన్ చేయాలని కలెక్టర్లకు సూచించారు.…
ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. సెకండ్ వేవ్ కోవిడ్ తాజా పరిస్థితులు, కట్టడి, వైద్య చికిత్సా ఏర్పాట్లు, వ్యాక్సినేషన్ పై సీఎం కీలక సమీక్ష చేపట్టారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సంబంధిత అధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఫోన్ చేసిన మూడు గంటల్లో…