COVID 19 Cases In India: ఇండియాలో కరోనా కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. రోజూవారీ కేసుల సంఖ్య 15 వేలకు పైగా కొనసాగుతోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరగుతోంది. ముఖ్యంగా కేరళ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. మరో వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఇండియాలో కోవిడ్ వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 200 కోట్లను దాటింది.
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం 16,678 కేసులు నమోదు కాగా మంగళవారం 13,615 పాజిటివ్ కేసులు మాత్రమే వెలుగుచూశాయి. ఇటీవల క్రమంగా పెరుగుతున్న కేసులు గత 24 గంటల్లో 3వేల వరకు తగ్గడంతో కొంత ఉపశమనం లభించినట్లు భావించవచ్చు. మరోవైపు తాజాగా 20 మంది కరోనా చనిపోయారు. కోవిడ్ నుంచి తాజాగా 13,265 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.50 శాతానికి పడిపోయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.23…
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,927 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మంగళవారం 2,483 కేసులు నమోదు కాగా బుధవారం కేసుల సంఖ్య 2,927కి పెరిగింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,65,496కి చేరింది. మరోవైపు కొత్తగా 32 మంది కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో 2,252 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 4,25,25,563 మంది కరోనా…
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా ముందుకు దూసుకెళ్తోంది. దేశంలో ఇప్పటివరకు 86 శాతం మంది పెద్దలకు రెండు డోసుల టీకాలు అందించామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ వెల్లడించారు. అలాగే చిన్నపిల్లలకు కూడా కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని తెలిపారు. 6 నుంచి 12 ఏళ్ల వారికి కొవాగ్జిన్, 5 నుంచి 12 ఏళ్ల వారికి కార్బెవాక్స్, 12 ఏళ్లు పైబడిన వారికి జై కోవ్ డీ వ్యాక్సిన్…
దేశంలో కరోనా ఇంకా అదుపులోకి రాలేదా? ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి వుందా? అంటే అవుననే అంటున్నారు డాక్టర్లు.వివిధ రకాల ఆరోగ్య ఇబ్బందులు వున్నవారు, వృద్ధులు, గుండెజబ్బులు, కిడ్నీ రోగాలు వున్నవారు ఈ ఫోర్త్ వేవ్ వల్ల ఇన్ఫెక్షన్ సోకే అవకాశం వుంది. షుగర్ పేషెంట్లు షుగర్ కంట్రోల్ లో వుంచుకోవాలని డాక్టర్ వసీం సూచిస్తున్నారు. అలాగే, వైద్య ఆరోగ్య శాఖ (medical health department) అధికారులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అయితే అంతగా ఆందోళన చెందవద్దని…
కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వి వంటి వ్యాక్సిన్‌లు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే సీరం ఇనిస్టిట్యూట్ ఇఫ్ ఇండియా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధి తగ్గించాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (NTAGI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి 12 నుంచి 16 వారాలుగా ఉంది. అయితే ఈ వ్యవధిని 8 నుంచి 16 వారాలకు…
భారత్‌లో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,568 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇదే సమయంలో 4,722 మంది కరోనా నుంచి కోలుకోగా 97 మంది మృతి చెందారు. ఒకవైపు కరోనా కేసులు తగ్గుతున్నా మరణాల సంఖ్య మాత్రం పెరగడం గమనార్హం. ముందురోజు 27గా ఉన్న మరణాల సంఖ్య… 24 గంటల వ్యవధిలోనే 97కి పెరిగింది. కొన్నిరోజులుగా ఇండియాలో కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నా మరణాల విషయంలో మాత్రం హెచ్చుతగ్గులు వస్తున్నాయి. తాజాగా…
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 13,166 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కరోనాతో మరో 302 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,94,345కి చేరింది. కరోనా మృతుల సంఖ్య 5,13, 226గా నమోదైంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 26,988 మంది కరోనా నుంచి కోలు కున్నారు.…
దేశంలో కరోనా థర్డ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. దీంతో కొన్నిరోజులుగా కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన హెల్త్ బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,407 కరోనా కేసులు వెలుగుచూశాయి. తాజా కేసులతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,25,86,544కి చేరింది. అయితే కరోనా మరణాలు మాత్రం నిలకడగా నమోదవుతున్నాయి. కొత్తగా 804 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,07,981కి పెరిగింది. అటు…
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు తొలగిపోయినట్లే కనిపిస్తోంది. ఫిబ్రవరి తొలివారంలో కరోనా కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అయితే నిన్నటితో పోలిస్తే కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 67, 597 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన బులెటిన్ ప్రకారం 71,365 కేసులు వెలుగుచూశాయి. అంటే నిన్నటితో పోలిస్తే 4వేల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. తాజా కేసులతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,24,10,976కి…