కరోనా విశ్వమంతా కల్లోలం కలిగిస్తోంది. ఈ మహమ్మారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి మాస్క్, వ్యాక్సిన్ తప్పనిసరి. దేశవ్యాప్తంగా 127 కోట్లమందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు. కానీ కొందరు మాత్రం తమ వైఖరి మార్చుకోవడం లేదు. జగిత్యాలలో కరోనా వ్యాక్సిన్ వేసుకోనంటూ ఓ వ్యక్తి హంగామా చేసిన వీడియో వైరల్ గా మారింది.
READ ALSO:ఈ బామ్మలు సమ్‌థింగ్ స్పెషల్.. ఎందుకో తెలుసా?
ఊరు వదిలైనా వెళ్తా కాని వ్యాక్సిన్ వేసుకోనంటూ వైద్య సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఎలాంటి సమస్య రాదని అధికారులు పేపర్ పై రాసివ్వాలంటూ గగ్గోలు పెట్టాడు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం తాటిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో చేసేదేం లేక వ్యాక్సిన్ ఇవ్వకుండానే వెనుదిరిగారు అధికారులు. మరోవైపు ఓమిక్రాన్ దడ పుట్టిస్తున్న వేళ వ్యాక్సిన్ వేయించుకోని వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం వుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోని పిసాంగన్ ప్రాంతంలోని నాగెలావ్ గ్రామంలో మహిళ వ్యాక్సిన్ వేయడానికి వచ్చిన వైద్యసిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. పాముని తెచ్చి కరిపిస్తామని బెదిరించారు.