కరోనాను తరిమేసేందుకు ఇప్పుడు అందుబాటులో ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. సాధ్యమైనంత త్వరలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని ముందుకు సాగుతున్నాయి ప్రభుత్వాలు.. ఇందులో భాగంగా రెగ్యులర్‌గా ప్రభుత్వ ఆస్పత్రలు, పీహెచ్‌సీ సెంటర్లలో.. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ సాగుతున్నా.. మరింత విస్తృతంగా వ్యాక్సిన్ వేయాలన్న ఉద్దేశంతో.. జీహెచ్‌ఎంసీ కంటోన్మెంట్ ఏరియాలలో కోవిడ్ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది ప్రభుత్వం.. ఈ నెల 23వ తేదీ నుండి 10-15 రోజుల పాటు ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగనుంది… జీహెచ్‌ఎంసీలోని 4,846 కాలనీలు, మురికివాడలు, కంటోన్మెంట్ జోన్‌లోని 360 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం కొనసాగనుంది.. ఈ ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రధాన లక్ష్యం హైదరాబాద్‌ను 100 శాతం కోవిడ్ టీకాలు వేసిన నగరంగా మార్చడమే.. మొత్తం 175 మొబైల్ వ్యాక్సిన్ వాహనాలు టీకా కోసం సిద్ధం చేస్తున్నారు అధికారులు.