తెలంగాణ 15 ఏళ్ల నుంచి 17 ఏళ్ల లోపు టీనేజర్లకు కరోనా వ్యాక్సిన్ అందించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు హన్మకొండలో 103 శాతం మేర వ్యాక్సినేషన్ జరగ్గా… రంగారెడ్డి జిల్లా 51 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లాలో 1,77,102 మంది 15 నుంచి 17 ఏళ్ల లోపువారుండగా.. కేవలం 90,046 మందికే ఇప్పటిదాకా కరోనా వ్యాక్సిన్ వేశారు. అటు రాష్ట్రంలోని 11 జిల్లాల్లో టీనేజర్లకు వ్యాక్సినేషన్ కవరేజీ 70 శాతం లోపే ఉంది. Read…
కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారత్ మరో రికార్డు సృష్టించింది. గత ఏడాది జనవరిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా… ఇప్పటివరకు 165 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దేశంలో 75 శాతానికి పైగా జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ట్వీట్ చేశారు. అందరి కృషితో కరోనాను ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై…
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రోజూవారీ కరోనా కేసులు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి. గడిచిన 24గంటల్లో 18,69,642 టెస్టులు చేయగా… 2,82, 970 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మంగళవారం నాటితో పోలిస్తే 44,889 ఎక్కువ కరోనా కేసులు వెలుగు చూశాయి. కొత్తగా 441 మంది మరణించగా… 1,88,157 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులు ఉండగా… పాజిటివిటీ రేటు 15.13…
దేశంలో కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి జనవరి 16తో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్టాంప్‌ను ఆవిష్కరించింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పోస్టల్ స్టాంపు ముద్రించి ఆదివారం నాడు విడుదల చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సినేషన్ ప్రారంభమై ఏడాది పూర్తయినందున ఈరోజు ముఖ్యమైన రోజు అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోందన్నారు. ఇండియాలో కరోనా టీకాల పంపిణీని…
దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ లేఖ రాశారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితి అస్థిరంగా ఉందని…. కరోనాతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య సైతం మారొచ్చని అప్రమత్తం చేశారు. వైద్య సిబ్బంది సేవలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని ప్రభుత్వాలకు సూచించారు. జంబో వైద్య కేంద్రాలు, ఫీల్డ్ ఆస్పత్రులను ఏర్పాటు చేసిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా కరోనా సోకిన వారిలో కేవలం…
ఏపీలో రేపట్నుంచి 60 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 10-13 వరకు హెల్త్ కేర్ వర్కర్లకు బూస్టర్ డోసులు, 12, 13వ తేదీల నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోసులు ఇవ్వనున్న ప్రభుత్వం పేర్కొంది. మున్సిపాల్టీలు, పీఆర్ అండ్ ఆర్డీ, పోలీస్ శాఖలోని వివిధ విభాగాల ఉద్యోగులకు…
దేశంలో కరోనా కేసులు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి. వారం కిందటి వరకు ప్రతిరోజూ వేలల్లో నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం లక్షల్లో నమోదవుతున్నాయి. దేశంలో గడిచిన 24 గంటల్లో 1,41,986 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,53,68,312కి చేరింది. నిన్న 285 మంది కరోనాతో మృతి చెందినట్లు కేంద్రం తెలిపింది. దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,83,178కి చేరింది. ప్రస్తుతం దేశంలో…
భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న వేళ… వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరో మైలురాయిని చేరింది. తొలి, రెండో డోసు కలిపి 150 కోట్ల మైలురాయిని అధిగమించింది. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. ‘కొత్త ఏడాదిలో ఈ రికార్డు సాధించడం ఆనందంగా ఉంది. వ్యాక్సిన్ రూపొందించిన శాస్త్రవేత్తలు, కంపెనీలు, హెల్త్ కేర్ ఉద్యోగులకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి కష్టంతో ఈ మైలురాయిని సాధించాం. సున్నా నుంచి ఈ స్థాయికి…
కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో భారత్‌లో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 37,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 124 మంది కరోనాతో చనిపోయారు. రోజువారీ పాజిటివ్ రేటు పెరిగి 3.24 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. Read Also: సంక్రాంతి బస్సులు: ఏపీఎస్ఆర్టీసీ…
తెలంగాణలో జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ కావాల్సిన వారు జనవరి 1 నుంచి కోవిన్ పోర్టల్‌లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. 2007 కంటే ముందు పుట్టిన పిల్లలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తామని… పీహెచ్‌సీలు, వైద్య కాలేజీల్లో టీకాలు వేస్తామని మంత్రి హరీష్‌రావు చెప్పారు. తెలంగాణలో 15-18 ఏళ్ల చిన్నారులు 22.78 లక్షల మంది ఉన్నారని.. 61 ఏళ్లు దాటిన వారు…