తెలంగాణలో జనవరి 3 నుంచి 15-18 ఏళ్ల చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు మంత్రి హరీష్‌రావు ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ కావాల్సిన వారు జనవరి 1 నుంచి కోవిన్ పోర్టల్‌లో ముందుగా స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. 2007 కంటే ముందు పుట్టిన పిల్లలందరికీ కరోనా వ్యాక్సిన్ ఇస్తామని… పీహెచ్‌సీలు, వైద్య కాలేజీల్లో టీకాలు వేస్తామని మంత్రి హరీష్‌రావు చెప్పారు. తెలంగాణలో 15-18 ఏళ్ల చిన్నారులు 22.78 లక్షల మంది ఉన్నారని.. 61 ఏళ్లు దాటిన వారు 41.60 లక్షల మంది ఉన్నారని తెలిపారు.
Read Also: విశాఖ పోర్టు అరుదైన ఘనత
మరోవైపు తెలంగాణలో 100 శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ పంపిణీ పూర్తయిందని మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా కోఠిలోని కోవిడ్ కంట్రోల్ రూమ్‌లో ఆయన కేక్ కట్ చేశారు. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటివరకు 62 కేసులు నమోదయ్యాయని… బాధితుల్లో 46 మంది టీకాలు తీసుకోలేదన్నారు. తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కొరత లేదని.. 30 లక్షల డోసులు అందుబాటులో ఉన్నట్లు మంత్రి హరీష్‌రావు సూచించారు.