దేశంలో కరోనా నివారణకు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించి జనవరి 16తో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక స్టాంప్‌ను ఆవిష్కరించింది. వ్యాక్సినేషన్‌కు సంబంధించిన పోస్టల్ స్టాంపు ముద్రించి ఆదివారం నాడు విడుదల చేసింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో వ్యాక్సినేషన్ ప్రారంభమై ఏడాది పూర్తయినందున ఈరోజు ముఖ్యమైన రోజు అని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరుగుతోందన్నారు.
ఇండియాలో కరోనా టీకాల పంపిణీని చూసి ప్రపంచమే ఆశ్చర్చపోతోందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 156 కోట్ల డోసులకు పైగా పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. 18 ఏళ్లు దాటిన వారిలో 93 శాతం మంది మొదటి డోస్… 70 శాతం మంది సెకండ్ డోస్ తీసుకున్నారని పేర్కొన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు, ఫార్మా కంపెనీలను ప్రధాని మోదీ ప్రోత్సహించారన్నారు. ఈ కారణంగానే భారత్‌లో అతిపెద్ద టీకా కార్యక్రమం నడుస్తోందన్నారు.