Covid-19: 2019లో ప్రారంభమైన కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికించింది. చైనా, భారత్, ఇటలీ, అమెరికా ఇలా అన్ని దేశాలను అతలాకుతలం చేసింది. తన రూపాన్ని మార్చుకుంటూ కోవిడ్-19 ప్రజలపై దాడి చేస్తూనే ఉంది.
మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి పీఎం మోదీకి ప్రజామోదం పెరగింది. తాజాగా సోమవారం లోకల్ సర్కిల్స్ తాజా సర్వే వెల్లడింది. 64,000 మంది అభిప్రాయాలను తీసుకుంటే ఇందులో 67 శాతంమంది రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత మోదీ ప్రభుత్వం అంచనాలను అందుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో చాలా మరణాలు సంభవించాయి ఆ సమయంలో మోదీ ప్రజామోదం కేవలం 51 శాతం మాత్రమే ఉండేది. 2020 కోవిడ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇది 62…
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినా..అక్కడక్కడా పెరుగుతున్న కేసుల నేపథ్యంలో అప్రమత్తంగా వుండాలంటున్నారు నిపుణులు. ఇదిలా వుంటే పిల్లల వ్యాక్సినేషన్ సురక్షితమేనని నిపుణులు విశ్లేషించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తన కీలక తీర్పు వెల్లడించింది. నిపుణులు తమ అభిప్రాయం చెప్పాక తాము నిర్ణయాన్ని వెలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో పిల్లలకు కొవిడ్ టీకాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.. శాస్త్రీయ ఏకాభిప్రాయం, ప్రపంచ సాధికార సంస్థల సూచనలకు అనుగుణంగానే ఉన్నట్లు…
కరోనా లాక్‌డౌన్ హీరో సోనూసూద్ మంచి మనసు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో అంకుర హాస్పిటల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ వ్యవహరిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా తమ 12వ ఆస్పత్రిని అంకుర హాస్పిటల్స్ సంస్థ ప్రారంభించనుంది. ఈ ఏడాదిలోనే మరో నాలుగు ఆస్పత్రులను అంకుర సంస్థ ప్రారంభించనుంది. ఈ మేరకు తమ హాస్పిటల్స్ విస్తరణపై అంకుర యాజమాన్యం హైదరాబాద్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సోనూసూద్, అంకుర ఎండీ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ…
కోవిడ్ పేరు చెబితేనే ప్రపంచదేశాలు ఇప్పటికీ వణికిపోతున్నాయి.. ఎక్కడైనా వింత వ్యాధి వెలుగుచూసిందంటే.. దాని వెనుక కోవిడ్ మూలాలు ఉన్నాయా? అనే అనుమానంతో చూడాల్సిన రిస్థితి.. ఇప్పటికే ఆల్ఫా, బీటా, ఒమిక్రాన్ ఇలా.. కొత్త వేరియంట్లుగా ప్రజలపై దాడి చేస్తూనే వస్తోంది హమ్మారి.. మరి, కోవిడ్‌కు అంతం ఎప్పుడు? దాని బారినుంచి బయటపడేది ఎన్నడు? అనే సందేహాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ‍్ల్యూహెచ్‌వో) కరోనా ముగింపు దశపై ఓ ప్రకటన చేసింది.…
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.. అయితే, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య తగ్గడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. వెంటనే టెస్టుల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉందని రాష్ట్రాలకు సూచించింది. మహమ్మారిని సమర్థంగా ట్రాక్ చేసేందుకు, తద్వారా సరైన జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు.. కేసులను ముందస్తుగా గుర్తించడం ముఖ్యమని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. Read Also: ఇక వన్డే సమరం.. సిరీస్‌పై…
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది.. ఈనెల 29 నుంచి డిసెంబర్ 23 వరకు శీతాకాల పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది పార్లమెంట్ వ్యవహారాల కేబినెట్ కమిటీ. కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలో ఇవాళ భేటీ అయిన కమిటీ… కోవిడ్ నిబంధనలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈసమావేశాల్లో నిత్యవసర ధరలతో పాటు సాగు చట్టాలు, పెగాసెస్ వ్యవహారంపై విపక్షాలు కేంద్రాన్ని నిలదీసే అవకాశముంది… ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం అవుతుండగా.. విపక్షాలను ఎలా తిప్పికొట్టాలన్న వ్యూహాలపై…
కరోనా ఫస్ట్ వేవ్ కలవరపెడితే.. సెకండ్ వేవ్ చాలా మంది ప్రాణాలు తీసింది.. ఇప్పటికే కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైపోయింది.. భారత్‌లోనూ వచ్చే నెలలోనే థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.. ఇంకా, సెకండ్ వేవ్ ముప్పు పోలేదని ఇప్పటికే భారత్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక, తాజా పరిస్థితిలపై స్పందించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. చాలా దేశాల్లో డెల్టా వేరియంట్‌తో కరోనా కేసులు పెరుగుతున్నాయని, మహమ్మారి తగ్గలేదనేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని అంటోంది..…
కరోనా మహమ్మారిపై సెలవిచ్చారు నిత్యానంద స్వామి… భారత్‌తో పాటు అనేక దేశాలకు కునుకులేకుండా చేస్తున్న కోవిడ్ వైరస్‌పై ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకుని.. గుట్టుచప్పుడు కాకుండా భారత్‌ను విడిచి పారిపోయిన నిత్యానంద.. కొంత కాలం ఎక్కడున్నారు కూడా ఎవ్వరికీ తెలియదు.. ఆ తర్వాత ఈక్వెడార్ సమీపంలో ఓ దీవిని కొనేసి.. దానికి కైలాస దేశం అని పేరు కూడా పెట్టేశారాయన.. అయితే, నిత్యానంద అక్కడున్నా.. భారత్‌లో మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తుంటారు..…