కరోనా మహమ్మారి రోజురోజుకు మరింతగా విజృంభిస్తోంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లోకి ప్రవేశించి దాని ప్రభావాన్ని చూపుతోంది. థర్డ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూను విధించారు. ఏపీలోనూ ఈ నెల 18 నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా రక్కసి ఎవ్వరినీ వదలిపెట్టడం లేదు.. ఇప్పటికే పలువురు సీని, రాజకీయ ప్రముఖులు కరోనా సోకి ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే వైద్యులకు సైతం కరోనా సోకుతుండడం…
థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు ఆంక్షలు విధింపుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నివారణా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని సీఎం సూచించారు. భౌతిక దూరం పాటించేలా, మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా చూడాలని, మాస్క్‌లు ధరించకపోతే జరిమానాను కొనసాగించాలన్నారు. దుకాణాల్లో, వ్యాపార సముదాయాల్లో కోవిడ్ ఆంక్షలు పాటించేలా చూడాలని జగన్ అన్నారు. బస్సు ప్రయాణికులు కూడా మాస్క్ ధరించేలా చూడాలని, బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇన్‌డోర్స్‌లో…
యావత్తు ప్రపంచ దేశాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. కరోనా బారిన పడి ఎంతో మంది జీవితాలు అతలాకుతలమయ్యాయి. ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన ప్రజలు ఇప్పుడు థర్డ్‌వేవ్‌తో తలమునకలవుతున్నారు. థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని వైద్యారోగ్య శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. అయితే కరోనా కష్టకాలంలో సైతం నిర్వారామంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు కూడా కరోనా బారినపడుతున్నారు. ఇప్పటికే పలువురు పోలీసులు కరోనా బారినపడగా.. తాజాగా…
కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో ఎంతో మంది జీవితాలను కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. మొన్నటి వరకు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడం, ఒమిక్రాన్ ఇండియాలో వ్యాప్తి చెందుతుండడంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో సైతం కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగతూ వస్తున్నాయి. అయితే వైద్యులు, వైద్య సిబ్బంది కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా ఉస్మానియా దవాఖానలో విధులు నిర్వహిస్తున్న…
కరోనా మహమ్మారి యావత్తు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ ఒమిక్రాన్ వెలుగులోకి వచ్చిన తరువాత మరోసారి విజృంభిస్తోంది. అయితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే భారత్‌లోకి ప్రవేశించి పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతోంది. తెలంగాణలో సైతం ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. అయితే కరోనా, ఒమిక్రాన్ కట్టడికి బూస్టర్ డోస్‌ను వేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించడంతో దేశంలోని పలు రాష్ట్రాలో బూస్టర్ డోస్‌లు పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో…
కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో గొప్ప అడుగు ముందుకేసింది. రెండో వేవ్‌లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరతను దృష్టిలో ఉంచుకున్న ముఖ్యమంత్రి, మెడికల్ ఆక్సిజన్ విషయంలో స్వావలంబన సాధించే దిశగా పలు కీలక చర్యలను తీసుకున్నారు. యాభై పడకలు దాటిన ప్రభుత్వాసుపత్రుల్లో సొంతంగా మెడికల్ ఆక్సిజన్ తయారీ యూనిట్లను నెలకొల్పడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఫలితంగా రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లోని వివిధ ఆస్పత్రుల్లో 133 పీఎస్‌ఏ మెడికల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిని…
ఉరుకుల పరుగుల జీవితాలు.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రించే వరకు.. నిద్రలోనూ.. భవిష్యత్ కార్యచరణపై ఆలోచనలతో సాగిపోతున్న వేళ.. కనివిని ఎరుగని రీతిలో కరోనా మహమ్మారి దెబ్బకొట్టింది. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా ధాటికి ఎన్నో కుటుంబాలు కకావికలమయ్యాయి. కరోనా దెబ్బకు అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనా ముందు మోకరిళ్లింది అనడంలో అతిశయోక్తి లేదు. కరోనా కట్టడికి కోవిడ్ నిబంధనలు పెట్టి, ఆఖరికి ప్రజలందరి కాళ్లకు లాక్‌డౌన్‌తో బంధం వేసినా కరోనా అదుపులోకి రాలేదు.…
కరోనా రక్కసి మరోసారి రెక్కలు చాస్తోంది. గత నెల మొదటి వారంలో దేశవ్యాప్తంగా 9 వేల లోపు నమోదైన కరోనా కేసులు, తాజాగా ఒక్కరోజులోనే 90వేలకు పైగా నమోదయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు పలు సూచనలు జారీ చేసింది. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న నాంపల్లి నుమాయిష్ ఈ ఏడాది పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్నందున ఈ నిర్ణయం…
తెలంగాణలో ఇంటర్ బోర్డు తీరుపై విద్యార్ధులు, తల్లిదండ్రులు మండిపడుతున్నారు. కరోనా కారణంగా పరీక్షలు రద్దుచేసి, తిరిగి నవంబర్ నెలలో పరీక్షలు నిర్వహించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 51 శాతం విద్యార్ధులు ఫెయిలయ్యారు. ఇంటర్ ఫలితాలలో అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఫెయిల్ అయింది విద్యార్థులా..? లేక ఇంటర్ బోర్డా..? అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్ధుల్లో కొందరికి పదిలోపే మార్కులు వచ్చాయి. బాగా చదివే విద్యార్ధులకు కూడా ఒకటి రెండు సబ్జెక్టుల్లో…
ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగనుంది. తొలిసారి ప్రత్యక్షంగా భేటీ అవుతోంది ప్రస్తుత పాలకమండలి. కౌన్సిల్ మీటింగ్ కోసం బల్దియా ఆఫీస్ లో ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న కౌన్సిల్ భేటీలో కీలక అంశాలు చర్చకు రానున్నాయి. సమావేశం వాడివేడిగా జరగనుంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన భేటీ కానున్న సమావేశంలో కార్పోరేటర్లు, ఎక్స్ అఫిషీయో సభ్యులుగా నగర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. కరోనా కారణంగా గతంలో వర్చువల్ గా…