ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.. పెరిగిన వంట నూనెల ధరలతో ఇబ్బంది పడుతోన్న ప్రజలకు తక్కువ ధరకే వంట నూనెలు అందిస్తోంది.. ఇవాళ్టి నుంచి వంట నూనె ధరలు తగ్గించి అమ్మాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. కిలో పామాయిల్ రూ. 110, సన్ ఫ్లవర్ నూనె రూ.124కే విక్రయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బోండాలు, బజ్జీలు, పూరీలు వేసుకోవాలంటే ఖచ్చితంగా నూనె ఉండాలి.. వాటికి మంచి రుచి రావాలంటే నూనెలో కాల్చాల్సిందే.. మనం ఇంట్లో ఎప్పుడో ఒక్కసారి చేసుకుంటేనే నూనెను ఎలాగో వాడేస్తాం.. అదే బయట జంక్ ఫుడ్ చేసేవాళ్లు అయితే చెప్పనక్కర్లేదు రోజూ అదే పనిమీద ఉంటారు.. ముఖ్యంగా కబాబ్, ఫిష్ ఫ్రై లాంటి వంటకాలకు ఎక్కువగా ఉపయోగించిన నూనెను మళ్లీ ఉపయోగిస్తూ ఉంటారు. కేవలం బయట మాత్రమే కాకుండా ఇంట్లో కూడా ఉపయోగించిన నూనెను మళ్లీ మళ్లీ ఉపయోగిస్తూ…
పంది కొవ్వుతో కల్తీ నూనెలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతోన్న కేటుగాడ్ని మాల్కాజగిరి పోలీసులు నిన్న (బుధవారం) అరెస్ట్ చేసినట్లు మల్కాజగిరి ఇన్‌స్పెక్టర్ రాములు వెల్లడించారు.
Edible oil prices: ధరలతో అల్లాడుతున్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీంతో వంట నూనెల ధరలు దిగిరానున్నాయి. ముఖ్యంగా సోయాబీన్ ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ పై దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5కి తగ్గించింది ప్రభుత్వం.
Freedom: ఒక్కో ఇంటిలో ఒక్కో నూనె వాడుతుంటారు. వినియోగదారులు.. వంటను నూనెను మారుస్తుంటారు. ఏడాది పొడవునా ఒకే వంట నూనె వాడటం బెటరా? (లేక) వంట నూనెను తరచూ మారుస్తూ ఉండటం బెటరా? అనేది కష్టమర్ల టేస్టును బట్టి, బడ్జెట్‌ను బట్టి ఉంటుంది.
మానాలు సాధారణంగా శుద్ధమైన ప్రత్యేక పెట్రోల్‌తో నడుస్తాయి. దీనిని విమాన ఇంధనమని పిలుస్తారు. ఉక్రెయిన్-రష్యా యుద్దం కారణంగా ధరలు భారీగా పెరగడంతో వంట నూనెల పేరు వింటేనే జనం జంకే పరిస్థితి. వంట నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. విమానయాన రంగంలో సంచలన మలుపుగా వంట నూనెతో నడిచిన విమానం ఆకాశంలోకి ఎగురుతోంది.
Cooking Oil: వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతి సుంకంపై కల్పిస్తున్న రాయితీలను 2023 మార్చి వరకు కొనసాగుతాయని కేంద్ర ఆహార శాఖ ప్రకటించింది.
పెరుగుతున్న ద్రవ్యోల్భనానికి అడ్డుకట్ట వేసేందుకు, నిత్యావసరాల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే పెట్రోల్ , డిజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో పెరుగుతున్న ఇంధన రేట్లతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కేంద్రం కాస్త ఉపశమనం కలిపించింది. కేంద్రం బాటలోనే కేరళ, మహారాష్ట్ర, రాజస్తాన్ వంటి రాష్ట్రాలు వ్యాట్ ను కూడా తగ్గించాయి. ఇదిలా ఉంటే వరసగా పెరుగుతున్న వంట నూనెల ధరలకు కళ్లెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక…
విమానయాన రంగంలో సంచలనం చోటు చేసుకుంది. వంటనూనెతో నడిచిన విమానం ఆకాశంలో ఎగిరింది. అంతేకాకుండా విజయవంతంగా ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఇప్పటివరకు విమానాలలో ఇంధనంగా వైట్ పెట్రోల్‌నే వాడుతుండగా తాజాగా వంటనూనె వాడటం ఓ మలుపుగానే భావించాల్సి ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎయిర్ బస్ సంస్థ వారి సూపర్ జంబో విమానం ఎయిర్‌బస్ ఏ-380 పెట్రోల్ కాకుండా పూర్తిగా వంటనూనె ఇంధనంగా తొలి ప్రయాణాన్ని విజయవంతంగా ముగించింది. ఎయిర్‌బస్ విమానం గత వారం ఫ్రాన్స్‌లోని టౌలూస్ బ్లాగ్నక్…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో వంట నూనెలకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో భారత్‌లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పలు చోట్ల వ్యాపారులు దొరికిందే సందు అని నూనె ప్యాకెట్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో వంట నూనెలను ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ రేట్లకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ అధికారి శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు. పాత స్టాక్ విషయంలో వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని…