Telangana : తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. ఫిక్స్‌డ్ టెన్యూర్, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సేవలందిస్తున్న 12,055 మంది ఉద్యోగుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు వారి సేవలను పొడిగిస్తూ అధికారికంగా జీవో (ప్రభుత్వ ఉత్తర్వులు) జారీ చేసింది.…
కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో, జిల్లాలలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలు ఏడాదిపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. ఈ ఏడాది మార్చి 31వ తేదీతో కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవా కాలం ముగిసిపోగా.. వారి సేవలను 2026 ఏడాది మార్చి 30వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు..
ఏపీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. దసరా కానుకగా కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్‌ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల ఉన్నత, సాంకేతిక విద్య, న్యాయ విభాగం, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మత్స్య శాఖ, యువజన సర్వీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, సాధారణ పరిపాలన, హోం, ప్లానింగ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ విభాగాలలోని కాంట్రాక్ట్…
ఎన్నో సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా మగ్గిపోతున్న ఉద్యోగులకు తెలంగాణ ఆర్థిక శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చేసేందుకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తును వేగవంతం చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయి. అన్ని శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రతిపాదనలు ఇవ్వాలని అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన పోస్టుల్లో రోస్టర్, రూల్…
ఏపీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం సీనియర్ కేటగిరీలో అసిస్టెంట్, స్టెనో, అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్ తదితరులకు రూ.17,500 నుంచి రూ.21,500కు జీతం పెరిగింది. మరోవైపు జూనియర్ విభాగంలో అసిస్టెంట్, స్టెనో, డ్రైవర్, టైపిస్ట్, మెకానిక్, ఫిట్టర్ తదితరులకు జీతాన్ని రూ.15వేల నుంచి 18,500కి పెంచుతున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరితో…
తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీల కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ అధ్యాపకులు సర్వీసును రెన్యువల్ చేస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. 31 మే 2022 వరకు 1,217 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ లెక్చరర్ల సేవలను పొడిగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే వీరిలో గౌరవ వేతనంపై పనిచేసే అధ్యాపకులు కూడా ఉన్నారు. అయితే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్…